ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ హిస్టరీ క్రియేట్ చేస్తారా?
ఫైనల్‌గా ఫిబ్రవరి 20న హైవోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌తో ఈ మూవీ షూటింగ్‌ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రారంభించారు.
By: Tupaki Desk | 9 April 2025 3:58 AMకేజీఎఫ్ సిరీస్‌తో సంచలనం సృష్టించిన క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆ తరువాత చేసిన `సలార్`తో మాత్రం ఆ స్థాయిలో ఫ్యాన్స్‌ని, సినీ లవర్స్‌ని సంతృప్తి పరచలేకపోయాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై పగడింది. `సలార్` తరువాత ప్రశాంత్ నీల్..యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో భారీ హైవోల్టేజ్ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన దగ్గరి నుంచి ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.
ఫైనల్‌గా ఫిబ్రవరి 20న హైవోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌తో ఈ మూవీ షూటింగ్‌ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రారంభించారు. `న్యూ వేవ్ ఆఫ్ యాక్షన్ అండ్ యుఫోరియా` అంటూ టీమ్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసిన ఫొటో ఎన్టీఆర్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ప్రశాంత్ నీల్ డార్క్ థీమ్ ఫాంటసీ ప్రపంచంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది. వలసవాదుల వ్యథల నేపథ్యంలో రా కంటెంట్‌తో ఈ సినిమా సాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా ప్రకటించినప్పుడే ఎన్టీఆర్ రగ్గ్‌డ్ లుక్‌ని విడుదల చేసిన మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌పై అంచనాల్ని పెంచేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో ఆ స్థాయిలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ఈ సినిమాతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. అయితే రీసెంట్‌గా ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమాకు ఇదే టైటిల్‌ని వాడేయడంతో `డ్రాగన్`నే ఫైనల్ చేస్తారా లేదా మరో టైటిల్‌కు వెళతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. `దేవర` యావరేజ్‌గా నిలవడంతో ఈ సినిమాతో ఎలాగైనా గట్టిగా కొట్టాలని, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఓ ట్రీట్‌లా ఈ సినిమా ఉండాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఈ బుధవారం (ఏప్రిల్ 9)న రాబోతోంది. ఎన్టీఆర్ లుక్‌ని మరోసారి రిలీజ్ చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ మేకర్స్ మాత్రం సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా ఏప్రిల్ 9న ఈ మూవీని రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని, అదే విషయాన్ని బుధవారం ప్రకటించే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్.