వార్ 2 ఎన్టీఆర్ రోల్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న వార్ 2లో ఎన్టీఆర్ నెవ్వర్ బిఫోర్ అనేలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ పోషించనున్నట్లు సమాచారం.
By: Tupaki Desk | 5 Feb 2025 5:50 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ డెబ్యూ సినిమా వార్ 2 గురించి సినీ ప్రేమికుల్లో భారీ ఆసక్తి నెలకొంది. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌కి నేషనల్ లెవెల్‌లో భారీ హైప్ క్రియేట్ అయింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ దశలో ఉంది. బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు ఇది తొలి చిత్రం కావడంతో పాటు, అతని రోల్ గురించి వస్తున్న రూమర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న వార్ 2లో ఎన్టీఆర్ నెవ్వర్ బిఫోర్ అనేలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ పోషించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆయన భారత రా (RAW) ఏజెంట్‌గా కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఓ సాధారణ రా ఏజెంట్ పాత్ర కాదని, కాస్త డిఫరెంట్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. బాలీవుడ్‌లో తెలుగు హీరోల మార్కెట్ పెరుగుతున్న తరుణంలో, ఎన్టీఆర్ కేవలం ఓ సపోర్టింగ్ రోల్ మాత్రమే చేయడం లేదని, కథకు కీలకమైన క్యారెక్టర్‌లో నటిస్తున్నారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా, ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. సినిమాలో విరేంద్ర రఘునాథ్ అనే రోల్ చేస్తుండగా, ఇది ఒకప్పటి సౌత్ రా ఏజెంట్‌గా ఉంటుందని, అయితే ఏదో కారణంతో అతను రౌగ్ గా, అంటే ద్రోహం చేసిన ఏజెంట్‌గా మారతాడని సమాచారం. అంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా నెగటివ్ క్యారెక్టర్ కాదని, కానీ హృతిక్ రోషన్‌తో తలపడే కీలకమైన యాంగిల్ ఉంటుందని తెలుస్తోంది.
బాలీవుడ్‌లో విలన్ క్యారెక్టర్‌లో తెలుగు హీరో నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. హృతిక్ రోషన్ హీరోగా వార్ 2లో ఎన్టీఆర్‌తో తలపడే సీక్వెన్స్‌లు భారీ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నట్లు టాక్. బాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఉన్న క్రేజ్, టెక్నికల్ స్టాండర్డ్స్ మామూలుగా ఉండవు. అలాంటిది ఎన్టీఆర్‌కి సరిపడేలా హై ఓక్టేన్ ఫైట్ సీక్వెన్స్‌లు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కథలో కీలకమైన ట్విస్ట్‌గా మారబోతుందట.
కియారా అద్వాని ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ఎన్టీఆర్‌కు సంబంధించిన పాత్రలో కీలకంగా ఉండనుందా, లేదా హృతిక్ రోషన్‌తో జోడీగా నటిస్తున్నదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి వార్ 2లో ఎన్టీఆర్ పాత్ర గురించి వచ్చిన తాజా లీక్ అభిమానుల్లో అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. సినిమా రిలీజ్ అయ్యేలోపు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ రావొచ్చని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2025 చివర్లో లేదా 2026 ప్రారంభంలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ స్థాయిలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండటంతో, వార్ 2 భారతీయ సినిమా ఇండస్ట్రీలో మరో పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. మరి, ఎన్టీఆర్ హిందీ ఎంట్రీ ఏ రేంజ్‌లో ఉండబోతోందో చూడాలి.