Begin typing your search above and press return to search.

కాంతార 2 లో స్పెషల్ రోల్.. ఎన్టీఆర్ ఏమన్నారంటే..

కాంతారా మూవీతో దేశ వ్యాప్తంగా విశేషమైన పాపులారిటీ సొంతం చేసుకున్న టాలెంటెడ్ యాక్టర్ రిషబ్ శెట్టి.

By:  Tupaki Desk   |   1 Sep 2024 3:17 PM GMT
కాంతార 2 లో స్పెషల్ రోల్.. ఎన్టీఆర్ ఏమన్నారంటే..
X

కాంతారా మూవీతో దేశ వ్యాప్తంగా విశేషమైన పాపులారిటీ సొంతం చేసుకున్న టాలెంటెడ్ యాక్టర్ రిషబ్ శెట్టి. ఈ సినిమాని స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి తెరకెక్కించారు. కాంతారా మూవీతో బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టి నేషనల్ అవార్డు సైతం అందుకున్నారు. దీంతో ఆయన నుంచి రాబోయే కాంతారా 2పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

కచ్చితంగా ఈ సినిమాతో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో కాంతారా2 చిత్రాన్ని రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కర్ణాటకలోని ఉడిపి వెళ్లారు. అక్కడ కుటుంబంతో కలిసి శ్రీకృష్ణుడి ఆలయాన్ని దర్శించుకున్నారు. మంగళూరు ఎయిర్ పోర్ట్ లో రిషబ్ శెట్టి ఎన్టీఆర్ కి స్వాగతం చెప్పడంతో పాటుగా ఉడిపి ఆలయానికి దగ్గరుండి తీసుకొని వెళ్లారు.

అక్కడ దర్శనం అనంతరం ఎన్టీఆర్ ని కన్నడ మీడియా ప్రతినిధులు పలకరించారు. ఆలయంలో దర్శనానికి వచ్చానని ఎన్టీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. త్వరలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కాంతారా2లో ఏమైనా భాగం అయ్యే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు జూనియర్ ఎన్టీఆర్ ని అడిగారు.

'కచ్చితంగా చేస్తాను. రిషబ్ శెట్టి ఎప్పుడు ఒకే అన్న నేను సిద్ధంగా ఉంటాను' అని తారక్ చెప్పుకొచ్చారు. కాంతారా2లో కాకపోయిన రిషబ్ శెట్టి, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమాని భవిష్యత్తులో చూసే అవకాశం ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఇప్పటికే కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ చేస్తున్నారు.

రీసెంట్ గా ఈ సినిమా లాంచింగ్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే చూడాలని ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటున్నారు. అదే జరిగితే కచ్చితంగా ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారెంటీ. అలాగే తెలుగుతో పాటు కన్నడ భాషలో కూడా ఈ సినిమా దుమ్ము దులిపే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది.

ఉడిపి ఆలయం వద్ద ఎన్టీఆర్ మీడియాతో కన్నడ భాషలోనే మాట్లాడి అక్కడి ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కన్నడ భాషలో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభించొచ్చనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.