Begin typing your search above and press return to search.

`వార్-2` గురించి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఏమ‌న్నారంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్-మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `నాటు నాటు` పాట‌లో ఏ రేంజ్ లో పోటీ ప‌డి డాన్సు చేసారో తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Sep 2024 5:41 AM GMT
`వార్-2` గురించి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఏమ‌న్నారంటే?
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్-మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `నాటు నాటు` పాట‌లో ఏ రేంజ్ లో పోటీ ప‌డి డాన్సు చేసారో తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య రాజ‌మౌళి అలాంటి పాట ఒక‌టి ప్లాన్ చేసాడు? అని రిలీజ్ వ‌ర‌కూ తెలియ నే తెలియ‌దు. థియేట‌ర్లో ఆడియ‌న్స్ కి ఆ పాట ఓ బిగ్ స‌ర్ ప్రైజ్ ని అందించింది. చ‌ర‌ణ్-తార‌క్ మ‌ధ్య పోటీ ఆ రేంజ్ లో ఉంటుంద‌ని ఆడియ‌న్స్ ఏమాత్రం గెస్ చేసి ఉండ‌రు. ఆ పాట ఏకంగా ఆస్కార్ అవార్డునే గెలుచుకుంది.

టాలీవుడ్ లో ఓ ఇద్ద‌రు స్టార్ హీరోలు కలిస్తే సంచ‌ల‌నం అలా ఉంటుంద‌ని ప్ర‌పంచానికి చాటి చెప్పారు. మ‌రి ఇలాంటి నాటు నాటు ఊర మాస్ పాట‌ని ఎన్టీఆర్-హృతిక్ రోష‌న్ మ‌ధ్య కూడా ప్లాన్ చేస్తున్నారా? ఈ పాట కూడా ఇండియాని ఊపేయ‌డం ఖాయ‌మేనా? అంటే అలాగే క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఇద్ద‌రు ఆయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో వార్ -2 లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా దీన్ని య‌శ్ రాజ్ ఫిలింస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది.

ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ పూర్త‌యింది. తార‌క్ పై కూడా కొన్ని కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాలు పూర్తి చేసారు. తాజాగా `దేవ‌ర` ప్ర‌మోష‌న్ లో ఉన్న తార‌క్ `వార్ -2` గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందించా రు. ` వార్ -2` అద్భుతంగా, మాస్టర్ స్ట్రోక్"గా ఉండబోతోంది. ప్రేక్ష‌కులకు కొత్త అనుభూతిన‌చ్చే స‌న్నివే శాలెన్నో ఉంటాయ‌న్నారు. అలాగే తార‌క్-హృతిక్ రోష‌న్ మ‌ధ్య ఓసాంగ్ కూడా ఉంటుంద‌ని హింట్ ఇచ్చాడు.

ఓ పురాత‌న కాలానికి చెందిన పాట‌గా చెప్పుకొచ్చాడు. ఇంత‌కు మించి సినిమా గురించి ఎక్కువ‌గా రివీల్ చేయ‌లేన‌న్నారు. చెబితే ఆదిత్య చోప్రా నా సంగ‌తేంటో చూస్తార‌ని చ‌మ‌త్కరించారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇంత వ‌ర‌కూ వార్ -2 గురించి బాలీవుడ్ మీడియా త‌ప్ప టాలీవుడ్ మీడియా పెద్ద‌గా హైలైట్ చేయ‌లేదు. తాజాగా తార‌క్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మ‌రింత బ‌జ్ క్రియేట్ అవ్వ‌డం ఖాయం.