తారక్ ని సముద్రం ఇప్పట్లో వదిలేలా లేదు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఇప్పట్లో సీ బ్యాక్ డ్రాప్ వదిలేలా లేదా? ఆయన వద్దునుకున్నా అలాంటి కథలే సెట్ అవుతున్నాయా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది.
By: Tupaki Desk | 8 March 2025 10:00 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఇప్పట్లో సీ బ్యాక్ డ్రాప్ వదిలేలా లేదా? ఆయన వద్దునుకున్నా అలాంటి కథలే సెట్ అవుతున్నాయా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. తారక్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన `దేవర` మొదటి భాగమంతా సీ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. సముద్రంలో జరిగే కథ కావడంతో? చాలా సన్నివేశాలు సీలో ఉన్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలు....కంటైనర్లను దొంగిలించడం.. తీరానికి తలరించడం ఇలా ప్రతీ సీన్ లో సీ హైలైట్ అవుతుంది.
`దేవర 2` లో అదే కథను మరింత బలంగా చెప్పబోతున్నాడు కొరటాల. ధర్మం -అధర్మం అనే యుద్దంలో తారక్ చేసిన సిసలైన పోరాటాన్ని మరింత రిచ్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ప్రస్తుతం తారక్ బాలీవుడ్ లో `వార్ 2`లోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ లో కొన్ని సన్నివేశాలున్నాయట. వాటిని హృతిక్-తారక్ మధ్య ఎలాంటి బ్లూ మ్యాట్ లేకుండా ఒరిజినల్ సముద్రం లోనే చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
అలాగే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కూడా సీ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. 1960 బ్యాక్ డ్రాప్ గోల్డెన్ ట్రయాంగిల్ గా పిలవబడే సముద్ర తీర ప్రాంతంలో జరిగే డ్రగ్ మాఫియా స్టోరీ ఇది. ఈ కథకు నీల్ ఓ స్పెషల్ బ్యాక్ డ్రాప్ క్రియేట్ చేసి అవసరం మేర భారీ సెట్లు వేయిస్తున్నాడు. కథ ఎక్కువగా తీరానికి సంబంధించింది కావడంతో? సముద్రం లో చాలా సన్నివేశాలుంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
సెట్స్ లో కొంత పార్ట్ షూటింగ్ జరిగినా? కీలకమైన యాక్షన్ సన్నివేశాలు సీ లో నే ఉంటాయని తెలుస్తోంది. వీటిని ఏపీ తీరంలో కాకుండా కర్ణాటక, గోవా తీర ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా వరుసగా తారక్ సీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలకే కొన్నాళ్ల పాటు అంకితమవ్వాల్సిన పరిస్థితి. సముద్రం మధ్యంలో షూటింగ్ అంటే? ఎలా ఉంటుందో ఇప్పటికే తారక్ చూసాడు. తీవ్రమైన ఎండలో షూటింగ్ కష్టాలు ఎలా ఉంటాయో `దేవర` ప్రమోషన్ లో చెప్పకనే చెప్పిన సంగతి తెలిసిందే.