దళపతి విజయ్ డాన్సు పై తారక్ సంచలన వ్యాఖ్యలు!
అక్కడ అతడి దరిదాపుల్లో ఏ హీరో కూడా డాన్సులో పోటీలోకి రాలేడు.
By: Tupaki Desk | 19 Sep 2024 10:48 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప డాన్సర్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ నుంచి టాప్ -5 డాన్సర్ల లిస్ట్ తీస్తే అందులో తారక్ నెంబర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఐకాన్ స్టార్...మెగా పవర్ స్టార్ ఇలా కొంత మంది స్టార్లు టాప్ -5 లో కనిపిస్తారు. ఇక బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ నెంబవర్ వన్ డాన్సర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ అతడి దరిదాపుల్లో ఏ హీరో కూడా డాన్సులో పోటీలోకి రాలేడు.
ఇక కోలీవుడ్ లో దళపతి విజయ్ కి డాన్స్ పరంగా మంచి పేరుంది. డాన్సులో తనకంటూ ఓ స్టైల్ ఉంటుంది. ఎలాంటి పాటకైనా చాలా ఈజీగా డాన్స్ చేస్తాడు. తమిళ్ ఆడియన్స్ లో అతడి డాన్సు అంటే విపరీతమైన క్రేజ్. విజయ్ డాన్సుకే ప్రత్యేకమై అభిమానులున్నారు. కానీ తెలుగులో కి వచ్చే సరికి అతడి స్టెప్పులు మాత్రం కొన్ని సందర్భాల్లో ట్రోలింగ్ కి గురవుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా దళపతి డాన్సుపై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ప్రస్తుతం తారక్ `దేవర` ప్రమోషన్ లో భాగంగా చెన్నైలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వెట్రీమారన్ తో సినిమా చేస్తానని ప్రకటించాడు. సరిగ్గా ఇదే సమయంలో విజయ్ డాన్సులపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. `డ్యాన్స్ అంటే ఊపేయడం కాదు. ఫైట్స్ చేసినట్టు, జిమ్నాస్టిక్ చేసినట్టు డ్యాన్స్ ఉండకూడదు. డ్యాన్స్ అంటే డ్యాన్స్‌లా ఉండాలి. ఎఫర్ట్ లెస్‌లా డ్యాన్స్ చేయాలి. అలా విజయ్ మాత్రమే చేయగలరు.
అతను డాన్సు చేస్తే కష్టపడి స్టెప్పులు వేసినట్టు ఉండదు. కానీ అందులో ఓ బ్యూటీ ఉంటుంది. ఎంతో ఈజ్‌తో చేస్తే తప్ప అది రాదు. ఎక్స్ ట్రాలు లేకుండా కూల్‌గా, కంపోజింగ్‌గా స్టెప్పులు వేస్తారు. ఆయన డ్యాన్సులకు నేను పెద్ద అభిమానిని. ఒకప్పుడు ఆయన నేను ఫోన్లో ఎక్కువగా మాట్లాడుకునే వాళ్లం. కానీ ఇప్పుడు మాట్లాడుకుని చాలా కాలం అవుతోంది` అని అన్నారు.