Begin typing your search above and press return to search.

ఆ రెంటికీ ఎన్టీఆర్‌ క్లారిటీ ఇవ్వాలి..!

అదే సమయంలో కొన్ని టాక్‌ షో ల్లో, ఇంకా ఇంటర్వ్యూల్లో పాల్గొని దేవర హిందీ లో బాగానే ప్రమోట్‌ చేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   11 Sep 2024 12:14 PM GMT
ఆ రెంటికీ ఎన్టీఆర్‌ క్లారిటీ ఇవ్వాలి..!
X

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా రూపొందిన 'దేవర' సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయింది. హీరోయిన్‌ గా జాన్వీ కపూర్ నటించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్‌ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇటీవల ముంబైలో ల్యాండ్‌ అయిన ఎన్టీఆర్‌ 'దేవర' ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ లో పాల్గొన్నాడు. అదే సమయంలో కొన్ని టాక్‌ షో ల్లో, ఇంకా ఇంటర్వ్యూల్లో పాల్గొని దేవర హిందీ లో బాగానే ప్రమోట్‌ చేయడం జరిగింది.

చెన్నై, బెంగళూరు కు దేవర ప్రమోషన్ కోసం ఎన్టీఆర్‌ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ చేసిన సినిమా ఇదే అవ్వడంతో అన్ని భాషల ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఆసక్తికి తగ్గట్లుగా దేవర ను భారీ ఎత్తున ప్రమోషన్ చేయడం మంచి పరిణామంగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవర ప్రమోషన్ సమయంలో ఎన్టీఆర్‌ తన తదుపరి రెండు సినిమాల గురించి నోరు విప్పుతాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వార్‌ 2 షూటింగ్‌ ను మొదలు పెట్టిన ఎన్టీఆర్‌ ఆ సినిమా తో ఎప్పుడు వచ్చేది చెప్పాల్సి ఉంది.

ఎన్టీఆర్‌ వార్‌ 2 తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా తో రాబోతున్నాడు. ప్రస్తుతం సలార్‌ 2 పనిలో ఉన్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్ త్వరలోనే ఎన్టీఆర్‌ తో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన దేవర ఈవెంట్‌ కి ముందు ఎన్టీఆర్‌ తన సినిమాల దర్శకులు అయిన కొరటాల శివ, అయాన్ ముఖర్జీ, ప్రశాంత్‌ నీల్‌ లతో కలిసి ఒక ఫోటోను దిగి సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. దాంతో సినిమాల అప్‌డేట్స్ ఎన్టీఆర్‌ నోటి నుంచి వినాలని ఫ్యాన్స్ ఇంకా మీడియా వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దేవర సినిమా రెండు పార్ట్‌ లుగా రాబోతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫర్మ్‌ అయింది. రెండో పార్ట్‌ ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో ఎన్టీఆర్‌ లేదా కొరటాల శివ రాబోయే రోజుల్లో ప్రమోషన్ సందర్భంగా చెప్పాల్సి ఉంటుంది. మొత్తానికి ఎన్టీఆర్‌ తన రాబోయే సినిమాల గురించి, వాటి అప్‌డేట్స్ గురించి ఎప్పుడెప్పుడు మాట్లాడుతాడు, ఎప్పుడు వాటికి సంబంధించిన విషయాలను మీడియా ముందు మాట్లాడుతాడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.