Begin typing your search above and press return to search.

క్యాన్సర్ బాధిత అభిమానితో మాట్లాడిన ఎన్టీఆర్.. ధైర్యం చెబుతూ..

అందులో దేవర మూవీ చూసేసి చనిపోతానని, అంత వరకు తనని బ్రతికించాలని వేడుకుంటూ వీడియో పోస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   14 Sep 2024 1:05 PM GMT
క్యాన్సర్ బాధిత అభిమానితో మాట్లాడిన ఎన్టీఆర్.. ధైర్యం చెబుతూ..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో తారక్ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం రాయలసీమకి చెందిన కౌశిక్ అనే క్యాన్సిర్ బాధిత అభిమానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో దేవర మూవీ చూసేసి చనిపోతానని, అంత వరకు తనని బ్రతికించాలని వేడుకుంటూ వీడియో పోస్ట్ చేశారు. అతను బోన్ క్యాన్సర్ తో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

అతని చికిత్సకి 60 లక్షలు ఖర్చు అవుతోందని బాధితుడి తల్లి చెప్పింది. తన కొడుకుకి ఎన్టీఆర్ అంటే అభిమానం అని వీడియోలో పేర్కొంది. కొడుకుని బ్రతికించుకోవడానికి సాయం చేయాలని అభ్యర్ధించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ కావడంతో తారక్ వరకు చేరింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కౌశిక్ దగ్గరకి వెళ్లి ఓదార్చారు. తాజాగా ఎన్టీఆర్ కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడారు.

కౌశిక్ కి ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. నువ్వు ధైర్యంగా కోలుకొని బయటకి రావాలి. దేవర సినిమా చూడాలి అని ఎన్టీఆర్ వీడియో కాల్ లో అన్నారు. నువ్వు ముందు కోలుకొని బయటకొచ్చి తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి అని ఎన్టీఆర్ కౌశిక్ తో ఆప్యాయంగా మాట్లాడారు. మిమ్మల్ని నేను అస్సలు చూస్తానని అనుకోలేదన్న.. చాలా సంతోషంగా ఉంది అని కౌశిక్ తన ఆనందాన్ని ఎన్టీఆర్ తో పంచుకున్నారు.

నేను నీతో మాట్లాడకపోతే ఎలా చెప్పు అంటూ ఎన్టీఆర్ కౌశిక్ ని సరదాగా నవ్వించే ప్రయత్నం చేశారు. త్వరలో నీతో కలిసి దేవర చూస్తాను అంటూ ఎన్టీఆర్ కౌశిక్ కి హామీ ఇచ్చారు. దీనికి కౌశిక్ థాంక్స్ చెప్పారు. నేను ధైర్యంగా క్యాన్సర్ తో పోరాడుతాను అని కౌశిక్ ఎన్టీఆర్ తో షేర్ చేసుకున్నారు. కౌశిక్ తో మాట్లాడటం ద్వారా ఎన్టీఆర్ అతనికి సాంత్వన కలిగించారు. అలాగే కౌశిక్ తల్లిదండ్రులకి కూడా ఎన్టీఆర్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కౌశిక్ తో మాట్లాడిన వీడియోని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఎంతైనా గొప్ప మనసున్న వ్యక్తి అంటూ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్టార్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాటిని ఇప్పుడు దేవర టీమ్ సిద్ధం చేసే పనిలో ఉంది. దేవర మూవీ కోసం వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.