Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ లుక్.. అనుమానాలకు ఎండ్ కార్డ్!

కానీ తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఎన్టీఆర్ లుక్‌తో పరిస్థితి మారిపోయింది.

By:  Tupaki Desk   |   11 March 2025 3:32 PM IST
ఎన్టీఆర్ లుక్.. అనుమానాలకు ఎండ్ కార్డ్!
X

ఎన్టీఆర్ లుక్‌ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. జెప్టో యాడ్‌లో వచ్చిన స్టైల్‌ ఫ్యాన్స్‌కి అంతగా నచ్చలేదు. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్‌ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అభిమానులు ఎన్టీఆర్ ఏదైనా కొత్త లుక్ ట్రై చేస్తున్నాడా లేక ఇది యాడ్ కోసం మాత్రమేనా? అనే విషయంలో ఓ క్లారిటీ కోసం ఎదురుచూశారు. కానీ తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఎన్టీఆర్ లుక్‌తో పరిస్థితి మారిపోయింది.

సాధారణంగా ఎన్టీఆర్ ఎప్పుడు లుక్ మార్చినా అది ట్రెండింగ్ అవుతుంది. రభస, జనతా గ్యారేజ్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల్లో వేరియేషన్స్ చూపించిన ఆయన తాజా లుక్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఎన్టీఆర్ కూల్ లుక్‌లో అదరగొట్టాడు. స్టైలిష్ సన్‌గ్లాసెస్, క్యాజువల్ అవుట్‌ఫిట్‌లో అదిరిపోయేలా ఉన్నాడు. యాడ్‌లో లుక్ బాలేదని కామెంట్స్ చేసిన ఫ్యాన్స్ కూడా ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ లుక్ మాములుగా లేదని ఫుల్ సంతోషంగా ఉన్నారు.

ఈ లుక్ చూస్తే ఎన్టీఆర్ వార్ 2 కోసం ప్రత్యేకంగా రెడీ అవుతున్నాడని ఫిలింనగర్ టాక్. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలిచిపోనుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్ విభిన్నమైన క్యారెక్టర్ చేస్తున్నాడని సమాచారం.

ఇప్పటికే యాడ్ వల్ల అభిమానుల్లో కొన్ని మిశ్రమ అభిప్రాయాలు వచ్చాయి. ఆ యాడ్‌లో ఆయన హెయిర్ స్టైల్ అసలు కుదరలేదని, ఆయన లుక్‌ని మాములుగా చూపించారని ట్రోల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఎన్టీఆర్ స్టైల్ చూసిన తర్వాత ఇది స్పెషలైజ్డ్ లుక్ అంటూ ఓ క్లారిటీ వచ్చేసింది. అంటే యాడ్‌లో కనిపించిన లుక్ కేవలం ఆ యాడ్‌ కోసమేనని, నిజమైన స్టైల్ మాత్రం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించినట్టే అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘వార్ 2’ పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నప్పటికీ, మరో స్ట్రాంగ్ టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. టాలీవుడ్, బాలీవుడ్ మార్కెట్‌ను కలిపి తీసే విధంగా ఎన్టీఆర్ తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆయన ప్రస్తుతం చేస్తున్న కమర్షియల్ బ్రాండ్ యాడ్స్ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో ఉన్నాయనే విషయం అర్థమవుతోంది.

blockquote class="twitter-tweet">

#JrNTR spotted at the Mumbai airport#NTR #War2 #NTRNeel #NTRNelson #NTRJr #Tollywood #Dragon #Tupaki pic.twitter.com/W20YOXB1yz

— Tupaki (@tupaki_official)