Begin typing your search above and press return to search.

ఇంకా ఆలస్యమేందుకు దేవర?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Sep 2024 8:06 AM GMT
ఇంకా ఆలస్యమేందుకు దేవర?
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న దేవర కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.

ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ మంచి రెస్పాన్స్ అందుకుంది. మూవీపై ఆడియన్స్ లో భారీ బజ్ క్రియేట్ చేసింది. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మరికొద్ది గంటల్లో మరో సాంగ్ కూడా రిలీజ్ కానుంది. అయితే ప్రస్తుతం తారక్.. ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. తన ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని ప్రముఖ ఆలయాలు సందర్శిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి కూడా ఆయన వెంట ఉన్నారు.

అందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో మరో చర్చ జరుగుతోంది. తారక్ దేవర విషయంలో కాస్త ఫోకస్ పెంచాల్సిన టైమ్ వచ్చింది అని అంటున్నారు. ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. బాలీవుడ్ లో ప్రమోషన్స్ మొదలు పెట్టాల్సి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నార్త్ లో ఇంటర్వ్యూలు ఇచ్చుంటే బెటర్ అని చెబుతున్నారు.

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న దేవరకు హిందీ బెల్ట్ లో ఆదరణ అండ్ వసూళ్లు చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పటి నుంచే ప్రమోషన్స్ చేపట్టాలి. తెలుగులో సినిమా రిలీజ్ కు వారం ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టినా సరిపోతుంది. సినీ ప్రియులు అట్రాక్ట్ అవుతారు. కానీ బాలీవుడ్ లో అలా కాదు. కాస్త ముందుగానే హడావుడి చేయాలి. ఈ విషయాన్నే ఇప్పుడు గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. బీ టౌన్ లో మూవీని ప్రమోట్ చేయాలని కోరుతున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ తో తారక్.. నార్త్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకున్నారు. కాబట్టి ఉత్తరాదిలోని వివిధ నగరాల్లో ఎన్టీఆర్ పర్యటిస్తే సినిమాకు బాగా హెల్ప్ అవుతుందని నెటిజన్లు చెబుతున్నారు. మూవీపై బజ్ క్రియేట్ అయ్యేలా ఇంటర్వ్యూలు ఇవ్వాలని కోరుతున్నారు. మరి తారక్.. దేవర ప్రమోషన్స్ ను ఎప్పుడు మొదలు పెడతారో? ఎలాంటి ప్లాన్ తో ముందుకు వెళ్తారో వేచి చూడాలి.