Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ చేసిన వెల్లుల్లి కారం.. ఎవరి కోసమో తెలుసా..?

అందుకే కొన్ని విషయాలను ముఖ్యంగా ఇంటి గడప లోపలకు అడుగు వేస్తే తానొక స్టార్ అన్న విషయం మర్చిపోతారు.

By:  Tupaki Desk   |   30 March 2025 1:30 AM
ఎన్టీఆర్ చేసిన వెల్లుల్లి కారం.. ఎవరి కోసమో తెలుసా..?
X

ఎన్టీఆర్ ఏంటి వెల్లుల్లి కారం చేయడం ఏంటి అయినా అంత పెద్ద హీరో అసలు వంట చేయడం ఏంటి.. అసలు ఆయనకి వంట గది ఎక్కడ ఉందో తెలుసా.. అసలు అందులోకి ఆయన వెళ్తారా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. స్టార్స్ అంతా తమ పర్సనల్ లైఫ్ ని జనాలకు చూపించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే అభిమానులు వాళ్లే చేసినా సరే ఒక పట్టానా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. అందుకే కొన్ని విషయాలను ముఖ్యంగా ఇంటి గడప లోపలకు అడుగు వేస్తే తానొక స్టార్ అన్న విషయం మర్చిపోతారు.

అఫ్కోర్స్ అందరు హీరోలు ఇదే చేస్తారు.. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఫ్యామిలీ కోసం ఆయన గరిట పట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని తెలుస్తుంది. ఈమధ్యనే ఎన్టీఆర్ తన భార్య ప్రణతి కోసం వెల్లుల్లి కారం చేశాడట. ప్రణతికి కాస్త జలుబు చేయడం వల్ల నోరంతా చేదుగా ఉండటంతో ఏదైనా కారంగా తినాలని ఉందని అంటే యూట్యూబ్ లో వెల్లుల్లి కారం చూశారట.

వెంటనే ఇలా వంట గదిలోకి వెళ్లి అలా వెల్లుల్లి కారం చేసి తీసుకుని వచ్చారట తారక్. ఇంతకీ ఈ మ్యాటర్ అంతా ఏదో దగ్గర ఉండి చూసినట్టు మనకు ఎలా తెలుసా అని అనుకుంటున్నారు కదా.. ఎన్టీఆర్ ఇంట్లోకి వెళ్లకపోయినా ఆయన బావమరిది నార్నే నితిన్ ఈ విషయాన్ని బయట పెట్టారు. అక్క మీద తన బావ చూపించే ప్రేమని తన అభిమానులతో పంచుకున్నాడు.

ముఖ్యంగా ఎన్టీఆర్ హలీం కూడా చేస్తాడని చెప్పడం సర్ ప్రైజింగ్ గా అనిపించింది. ఏది ఏమైనా తెర మీద కత్తి పట్టి శత్రువులను సం హరించడమే కాదు గరిట పట్టి అద్భుతమైన వంటకాలు కూడా చేయడం వచ్చని ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు. ఒక ఫ్యామిలీ మెన్ గా ఎన్టీఆర్ తన కుటుంబంపై చూపించే ప్రేమ చూసి ప్రతి అభిమాని కూడా ఫిదా అవుతున్నాడు. ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ కూడా మ్యాడ్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమా సక్సెస్ అందుకోగా వెంటనే ఆయ్ చేశాడు అది కూడా సక్సెస్ అందుకుంది. లేటెస్ట్ గా మ్యాడ్ స్క్వేర్ అంటూ వచ్చి టాక్ తో సంబంధం లేకుండా సినిమా మంచి సక్సెస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఎన్టీఆర్ బావమరిదిగా నార్నె నితిన్ కూడా కెరీర్ నిలబెట్టుకున్నాడని చెప్పొచ్చు.