Begin typing your search above and press return to search.

యంగ్ టైగ‌ర్ విరాళంపై స్పందించిన రేవంత్, లోకేష్‌!

ఇరువురు ఎన్టీఆర్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఎన్టీఆర్ ప్ర‌క‌టించిన విరాళం బాధితుల‌కు ఎంత‌గోనా ఉప‌యోగ ప‌డుతుందన్నారు.

By:  Tupaki Desk   |   3 Sep 2024 11:53 AM GMT
యంగ్ టైగ‌ర్ విరాళంపై స్పందించిన రేవంత్, లోకేష్‌!
X

వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు అండ‌గా నేను ఉన్నానంటూ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రి స‌హాయ నిధికి కోటి రూపాయ‌లు విరాళం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఏపీకి 50 ల‌క్ష‌లు, తెలంగాణ 50 ల‌క్ష‌లు చొప్పున విరాళం అందించారు. బాధిత కుటుంబాలు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ దేవుడిని ప్రార్ధించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి, ఏపీ మంత్రి నారా లోకేష్ తార‌క్ విరాళంపై స్పందించారు.

ఇరువురు ఎన్టీఆర్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఎన్టీఆర్ ప్ర‌క‌టించిన విరాళం బాధితుల‌కు ఎంత‌గోనా ఉప‌యోగ ప‌డుతుందన్నారు. ఇక చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి రెండు ప్ర‌భుత్వాల స‌హాయ నిధికి భారీ ఎత్తున విరాళాలు అందుతోన్న సంగ‌తి తెలిసిందే. తొలుత నిర్మాత అశ్వినీద‌త్ త‌న విరాళాన్ని ప్ర‌క‌టించారు.

ఆ త‌ర్వాత తార‌క్ లైన్ లోకి వ‌చ్చారు. దీంతో వ‌రుస పెట్టి ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, న‌టులు త‌మ‌కు తోచిన స‌హాయం అందిస్తున్నారు. బాధితుల‌కు అండ‌గా అభిమానులు నిల‌వాల‌ని, త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకున్నారు. ఘ‌ట‌న‌పై దిగ్బ్రాంతిని వ్య‌క్తం చేసారు. ఇండ‌స్ట్రీ నుంచి ఇంకా పెద్ద ఎత్తున విరాళాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. స్టార్ హీరోలు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు చాలా మంది స్పందించే అవ‌కాశం ఉంది.

కొంత మంది హైద‌రాబాద్ లో లేక‌పోవ‌డం స‌హా విదేశాల్లో ఉండ‌టంతో, బిజీ షెడ్యూల్ కార‌ణంగా అందు బాటులోకి రాలేక‌పోతున్న‌ట్లు తెలుస్తోంది. విప‌త్తుల స‌మ‌యంలో చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి స‌హాయం అనేది ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. ఇటీవ‌లే కేర‌ళ విప‌త్తుపైనా ప‌లువురు న‌టులు స్పందించి విరాళాలు అందించిన సంగ‌తి తెలిసిందే.