ఆ గట్స్ ఉన్న ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్..!
ఈ క్రమంలోనే లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ గార్ కూడా సాగర సంగమం ఈ తరం హీరోలతో తీయాల్సి వస్తే అది ఎన్టీఆర్ వల్లే సాధ్యమని అన్నారు.
By: Tupaki Desk | 31 March 2025 1:38 PMమాస్ క్లాస్ సెంటిమెంట్ ఎమోషన్ ఎలాంటి పాత్ర అయినా అదరగొట్టేస్తాడు మన మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. 30 సినిమాల అనుభవంలో ఎన్టీఆర్ మంచి మంచి పాత్రలు చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ స్టార్స్ టచ్ చేయడానికి సాహసించని మైథాలజీ, సోషియో ఫాంటసీ సినిమాలు తారక్ చేసి చూపించాడు. అందుకే ఆయన మీద మిగతా దర్శకులకు ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. ఈ క్రమంలోనే లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ గార్ కూడా సాగర సంగమం ఈ తరం హీరోలతో తీయాల్సి వస్తే అది ఎన్టీఆర్ వల్లే సాధ్యమని అన్నారు.
ఆయన ఒకప్పటి వీడియో ఎప్పుడూ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటుంది. ఐతే ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు దేవర డైరెక్టర్ కొరటాల శివ. దేవర 1 జపాన్ రిలీజ్ ప్రమోషన్స్ లో అక్కడ మీడియాతో ఇంటర్వ్యూస్ తో పాల్గొన్నారు తారక్, కొరటాల శివ. ఈ క్రమంలో తనకు నచ్చిన సినిమా దర్శకుడు కె విశ్వనాథ్ గురించి చెప్పిన కొరటాల శివ ఈ జనరేషన్ లో ఆ సినిమా చేయగల నటుడు ఎన్టీఆర్ ఒక్కడే అని అన్నారు.
ఆల్రెడీ కె విశ్వనాథ్ గారు కూడా ఇదే విషయాన్ని ఒకసారి ప్రస్తావించారు. ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మంచి క్లాసికల్ డ్యాన్సర్ అని తెలిసిందే. అందుకే ఆయన డ్యాన్స్ లో ఒక స్టైల్, రిథం ఉంటాయి. సాగర సంగమం లాంటి సినిమా ఎన్టీఆర్ చేస్తే మాత్రం కచ్చితంగా అది రేర్ ఫీట్ అవుతుంది. ఆ కేపబిలిటీ గట్స్ ఉన్న ఒకే ఒక్క తెలుగు స్టార్ ఎన్టీఆర్ అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు.
కొరటాల శివ దేవర 1 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజైంది. ఇక దేవర 2 కథను ఇంకాస్త బాగా రాసుకుంటున్నాడు కొరటాల శివ. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో నెక్స్ట్ లెవెల్ మాస్ బొమ్మగా నీల్ ఎన్టీఆర్ సినిమా వస్తుందని తెలుస్తుంది. తన సినిమాల లైనప్ తో ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ఫీస్ట్ అందించేలా ఉన్నాడు తారక్.