Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ డ్రాగన్ తరువాత.. లైన్ లోకి ఆ దర్శకుడే..

ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ మరిన్ని కొత్త కాంబినేషన్స్ వెళ్లబోతున్నాడని ఇండస్ట్రీ టాక్.

By:  Tupaki Desk   |   25 March 2025 5:00 AM IST
Ntr Nelson Mass entertainer
X

ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తారక్‌కి ప్రస్తుతం వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఒకవైపు హృతిక్ రోషన్‌తో కలిసి బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 చేస్తున్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న డ్రాగన్ సినిమా కూడా అదే స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ మరిన్ని కొత్త కాంబినేషన్స్ వెళ్లబోతున్నాడని ఇండస్ట్రీ టాక్.

లేటెస్ట్ మరో క్రేజీ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ కలవబోతున్నట్లు టాక్ వస్తోంది. డాక్టర్, జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఎన్టీఆర్ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ఇందులో మాస్, యాక్షన్, కామెడీ అంశాలు సమపాళ్లలో ఉండేలా కథను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నెల్సన్ సినిమాలకు ప్రత్యేకత ఏమిటంటే.. సీరియస్ టోన్ ఉన్న కథలోనూ ఫన్ మూమెంట్స్‌ను బాగా మిక్స్ చేయడం.

ఇది జైలర్ సినిమాతో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పుడు అదే ఫార్ములాతో ఎన్టీఆర్ కోసం ఓ రఫ్ మాస్ క్యారెక్టర్‌ను డిజైన్ చేస్తున్నారట. ఈ సినిమా టైటిల్ విషయంలో తాజాగా ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు రాక్ (ROCK) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా, పాన్ ఇండియా ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉండే టైటిల్ కావాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.

అయితే ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్ నీల్ సినిమా తరువాత ఉండనున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నాయి. ఇప్పటికే నాగ వంశీ చర్చలు పూర్తి చేసుకుని నెల్సన్‌తో ప్రాజెక్ట్ ఫైనల్ చేశారట. ఈ ఏడాది చివర్లో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, 2026లో సినిమా సెట్స్‌పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇది పూర్తిగా మాస్, యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండనుందని, ఎన్టీఆర్ అభిమానులకు ఇది మరో విజువల్ ట్రీట్ అవుతుందని టాక్.

వార్ 2, డ్రాగన్ వంటి రెండు భారీ ప్రాజెక్టుల తర్వాత తారక్ చేసిన తరువాతి సినిమా ఇది కావడంతో, దీనిపై అంచనాలు భారీగా ఉంటాయి. పైగా నెల్సన్ మాస్ టేకింగ్‌తో కలిసే ఈ కాంబినేషన్ పక్కా హిట్ కాంబోగా మారే ఛాన్స్ ఉంది. రాక్ టైటిల్ ఎనౌన్స్‌మెంట్ అధికారికంగా వచ్చే వరకు ఇంకా స్పష్టత రానప్పటికీ, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.