Begin typing your search above and press return to search.

తారక్ బాలీవుడ్ డెబ్యూ మూవీ.. జోనర్ చేంజ్ అయిందా?

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ మూవీ లవర్స్.. ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీస్ లో వార్-2 ఒకటి.

By:  Tupaki Desk   |   2 Oct 2024 10:41 AM GMT
తారక్ బాలీవుడ్ డెబ్యూ మూవీ.. జోనర్ చేంజ్ అయిందా?
X

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ మూవీ లవర్స్.. ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీస్ లో వార్-2 ఒకటి. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సినిమాలో లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. బీ టౌన్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ.. గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న వార్-2తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న తారక్.. ఇప్పటికే పలు షూటింగ్ షెడ్యూల్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

మూవీలో నెగిటివ్‌ షేడ్స్‌ తో సాగే స్పై రోల్‌ లో తార‌క్ క‌నిపించ‌నున్నారని తెలుస్తుండగా.. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. అయితే మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ Spy Universeలోని ఏక్తా టైగర్‌, టైగర్‌ జిందా హై, వార్‌, పఠాన్‌, టైగర్‌ 3 తర్వాత ఆరో సినిమాగా వార్-2 రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

అయితే రీసెంట్ గా మొదలైన కొత్త షెడ్యూల్ లో హృతిక్‌, కియారాపై రొమాంటిక్ సాంగ్‌ ను బ్యూటిఫుల్ లొకేషన్స్ లో మేకర్స్ షూట్ చేసినట్లు తెలిసింది. ఇప్పుడు ఓ రొమాంటిక్ సీన్ కోసం ఇద్దరూ రెడీ అవుతున్నట్లు వీడియో వైరల్ కావడంతో.. సోషల్ మీడియాలో సినిమాపై జోరుగా చర్చ సాగుతోంది. వీడియోలో పలు సూచనలిస్తున్నట్లు అయాన్ ముఖర్జీ కనిపించగా.. మూవీ యాక్షన్ ప్యాక్డ్ గా కాకుండా రొమాంటిక్ కామెడీ జోనర్ లో మూవీ తెరకెక్కిస్తున్నారేమోనని అనుమానపడుతున్నారు.

ఇప్పటికే పలు రొమాంటిక్ జోనర్ లో వచ్చిన సినిమాలకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించడంతో.. ఫ్యాన్స్ మరింతగా డౌట్ పడుతున్నారు. కానీ వార్-2 ఇప్పటికే అనుకున్న స్పై జోనర్ లోనే తెరకెక్కుతోందని, సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ మాత్రం ఉంటాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. స్పెయిన్ బ్యాక్ డ్రాప్ లో ఒక సాంగ్ ఉంటుందని క్లారిటీ ఇస్తున్నాయి. అంతే కానీ.. యాక్షన్ జోనర్ నుంచి సినిమా కాన్సెప్ట్ బయటకు రాలేదని స్పష్టం చేస్తున్నాయి.

అదే సమయంలో ప్రీతమ్ కంపోజ్ చేసిన హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్.. అటు రొమాంటిక్.. ఇటు యాక్షన్ జోనర్ల అభిమానులను ఆకట్టుకోనుందని తెలుస్తోంది. సినిమాలో సాంగ్ తర్వాత.. అసలైన యాక్షన్ సీన్స్ ఉంటాయని సమాచారం. ముఖ్యంగా తారక్, హృతిక్ మధ్య సీన్స్ కూడా అప్పుడే ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మరి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న వార్-2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.