వార్ 2 : ఎన్టీఆర్ గురించి స్పెషల్ న్యూస్
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో వచ్చిన పాన్ ఇండియా స్టార్‌డం కారణంగా బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కి మంచి ఫాలోయింగ్ దక్కింది.
By: Tupaki Desk | 31 Dec 2024 6:30 AM GMTఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో వచ్చిన పాన్ ఇండియా స్టార్‌డం కారణంగా బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కి మంచి ఫాలోయింగ్ దక్కింది. అందుకే బాలీవుడ్ అతి పెద్ద యాక్షన్ మూవీ వార్ 2 లో నటించే అవకాశం దక్కింది. హృతిక్ రోషన్‌తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ వార్ 2 లో నటిస్తున్న విషయం తెల్సిందే. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న వార్ సినిమాకు ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. ఈమధ్య కాలంలో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేర్ చేస్తున్న స్పై థ్రిల్లర్ యాక్షన్ సినిమాల జోనర్‌లోనే ఈ సినిమా ఉండబోతుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి కొత్త చర్చ జరుగుతోంది.
హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ రోల్‌లో కనిపించబోతున్నాడు అనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడట. బాలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ప్రకారం ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో పాటు హీరో లక్షణాలు ఉండే పాత్రలోనూ కొంత సమయం కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకే పాత్ర రెండు విభిన్నమైన షేడ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్‌లో అయినా నటించి ఉండాలి అనేది సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ఎన్టీఆర్ దేవర సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దేవర సినిమాలో ఎన్టీఆర్ తండ్రి, కొడుకుగా రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. దేవర పార్ట్ 2 సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో సినిమా పట్టాలెక్కి 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే మొదలు అయ్యాయి. త్వరలోనే సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మొత్తానికి ఎన్టీఆర్ చేస్తున్న వార్ 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుంది అంటూ హిందీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సౌత్ ప్రేక్షకులు సైతం నమ్మకంగా ఉన్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చే సన్నివేశాలు, ఎన్టీఆర్ డబుల్ షెడెడ్ సన్నివేశాలు సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుతూ ఉన్నారు. 2025 ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్‌కి జోడీగా హీరోయిన్ ఉండక పోవచ్చు అని తెలుస్తోంది.