Begin typing your search above and press return to search.

మ‌రోసారి అన్న కోసం రానున్న ఎన్టీఆర్

మ‌రోవైపు ఎన్టీఆర్ తో పాటూ అత‌ని అన్న క‌ళ్యాణ్ రామ్ కూడా ప‌లు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

By:  Tupaki Desk   |   21 March 2025 9:30 AM
NTR For Arjun S/O Vyjayanthi
X

దేవ‌ర త‌ర్వాత‌ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చాలా బిజీ అయిపోయాడు. ఎన్టీఆర్ లైన‌ప్ లో ప‌లు భారీ సినిమాలున్నాయి. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో హృతిక్ రోష‌న్ తో క‌లిసి వార్2 సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా తో బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌నున్న విష‌యం తెలిసిందే.

వార్ 2 సినిమాను పూర్తి చేసుకుని ప్ర‌శాంత్ నీల్ సెట్స్ లో జాయిన్ కానున్నాడు తార‌క్. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్ప‌టికే మొద‌ల‌వగా, ఎన్టీఆర్ లేని సీన్స్ ను తెర‌కెక్కిస్తున్నాడు నీల్. అటు వార్2, ఇటు ప్ర‌శాంత్ నీల్ సినిమాల‌పై ఆడియ‌న్స్ లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రోవైపు ఎన్టీఆర్ తో పాటూ అత‌ని అన్న క‌ళ్యాణ్ రామ్ కూడా ప‌లు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

డెవిల్ త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తున్న సినిమా అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి. ప్ర‌దీప్ చిలుకూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో విజ‌య‌శాంతి ప‌వ‌ర్‌ఫుల్ రోల్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌ల్లీ కొడుకుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేక‌ర్స్. టీజ‌ర్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది.

టీజ‌ర్ తోనే సినిమాపై బ‌జ్ పెంచుకున్న అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతీని స‌మ్మ‌ర్ రేస్ లో నిల‌బెట్టాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే గ‌త కొన్ని సినిమాలుగా క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌కు ఎన్టీఆర్ గెస్టు గా వ‌చ్చి త‌న అన్న సినిమాను స‌పోర్ట్ చేయ‌డం అంద‌రం చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఎన్టీఆర్ గెస్ట్ గా వ‌చ్చి త‌న అన్న‌కు స‌పోర్ట్ చేస్తాడ‌ని తెలుస్తోంది. ఈ ఈవెంట్ ను హైద‌రాబాద్‌లోనే నిర్వ‌హించి, తార‌క్ ను గెస్టుగా తీసుకొస్తే సినిమాకు మ‌రింత హైప్ వ‌చ్చే అవ‌కాశముంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇంకా టైమ్ ఉండ‌టంతో ఈ విష‌యంపై మున్ముందు క్లారిటీ వ‌చ్చే ఛాన్సుంది.