Begin typing your search above and press return to search.

NTR 31: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే క్రేజీ అప్డేట్!

ఈ మూవీ రిలీజైన తర్వాతే ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్‌ షూట్ లో తారక్ జాయిన్ అవుతారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   1 Aug 2024 3:30 PM GMT
NTR 31: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే క్రేజీ అప్డేట్!
X

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా 'NTR 31' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి చాలా నెలలు గడుస్తున్నా, ఇంతవరకూ సెట్స్ మీదకు తీసుకెళ్ళలేదు. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

'NTR 31' సినిమాని సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం తారక్ 'దేవర' పార్ట్-1 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ మూవీ రిలీజైన తర్వాతే ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్‌ షూట్ లో తారక్ జాయిన్ అవుతారని అంటున్నారు. ఆలోపు హీరో లేని కొన్ని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ తో 'సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్' చిత్రాన్ని తెరకెక్కించి భారీ విషయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్.. వెంటనే 'సలార్ 2: శౌర్యాంగ పర్వం' ను సెట్స్ మీదకి తీసుకెళ్తారని అందరూ భావించారు. దీని కోసం ఏర్పాట్లు చేసినట్లుగా టాక్ కూడా వచ్చింది. కానీ ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం..తారక్ 'దేవర 1' షూటింగు చివరి దశకు చేరుకోవడంతో, అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన NTR 31 చిత్రాన్నే ముందుగా చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారు ప్రశాంత్ నీల్.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాని ఆగస్టులో స్టార్ట్ చేస్తానని మేకర్స్ ఆ మధ్య పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు సెప్టెంబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ప్రశాంత్ నీల్.. షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. వచ్చే నెల 27న 'దేవర 1' ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా షూట్ లో జాయిన్ అవుతారని అనుకుంటున్నారు. త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ సైడ్ నుంచి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఎలివేషన్స్, ఎమోషన్స్ ను ప్రశాంత్ అద్భుతంగా తెర మీద ఆవిష్కరిస్తారని KGF, సలార్ సినిమాలతో అర్థమైంది. మరోవైపు ఎలాంటి సంక్లిష్టమైన సన్నివేశం ఇచ్చినా తారక్ స్క్రీన్ మీద చెలరేగి పోతుంటారు. మరీ ముఖ్యంగా మాస్ యాక్షన్ సీన్స్ లో తనకు తానే సాటి అనిపించుకున్నారు. అలాంటి ఇద్దరు పవర్ హౌసెస్ ఇప్పుడు 'NTR 31' కోసం చేతులు కలపడం ట్రేడ్ లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఈ కలయిక వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చెయ్యడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.