Begin typing your search above and press return to search.

NTR-Neel: 1969 గోల్డెన్ ట్రయాంగిల్‌లో ఏం ప్లాన్ చేస్తున్నారో?

NTRNeel పోస్టర్ ను మనం నిశితంగా గమనిస్తే, వరల్డ్ మ్యాప్ లో చైనా, భూటాన్ దేశాల పేర్లతో పాటుగా 1969, గోల్డెన్ ట్రయాంగిల్ అనే అంశాలు ప్రస్తావించబడ్డాయి.

By:  Tupaki Desk   |   9 Aug 2024 4:49 PM GMT
NTR-Neel: 1969 గోల్డెన్ ట్రయాంగిల్‌లో ఏం ప్లాన్ చేస్తున్నారో?
X

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైంది. NTR 31 అనే వర్కింగ్ టైటిల్ తో అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్.. #ఎన్టీఆర్ Neel అనే పేరుతో శుక్రవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ పోస్టర్ లో ప్రస్తావించబడిన అంశాలు చూసి, తారక్ తో నీల్ ఏం ప్లాన్ చేస్తున్నాడనే చర్చలు మొదలయ్యాయి.

NTRNeel పోస్టర్ ను మనం నిశితంగా గమనిస్తే, వరల్డ్ మ్యాప్ లో చైనా, భూటాన్ దేశాల పేర్లతో పాటుగా 1969, గోల్డెన్ ట్రయాంగిల్ అనే అంశాలు ప్రస్తావించబడ్డాయి. దీంతో 1969 నాటి గోల్డెన్ ట్రయాంగిల్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల సినిమా ఉండబోతోందని సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తోంది. చైనా, భూటాన్, సిక్కిం మధ్య నల్లమందు వనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో జరిగే కథనే ఈ సినిమాలో చూపిస్తారనే ప్రచారం మొదలైంది.

గోల్డెన్ ట్రయాంగిల్ అనేది ఈశాన్య మయన్మార్ (బర్మా), నార్త్ వెస్ట్ థాయిలాండ్, నార్త్ లావోస్‌లో విస్తరించి ఉన్న ఒక పెద్ద పర్వత ప్రాంతం. ఇది 1950స్ నుండి ప్రపంచంలోని అతిపెద్ద నల్లమందు ఉత్పత్తి చేసే ప్రాంతాలలో ఒకటిగా నిలిచింది. దీన్ని డ్రగ్ క్యాపిటల్ గా పేర్కొనేవారు. గోల్డెన్ ట్రయాంగిల్‌లో స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించే ఖున్ సా కుమింటాంగ్ అనే వ్యక్తి డ్రగ్ లార్డ్ అని పేరు పొందాడు. షాన్ స్టేట్ ఆర్మీ గోల్డెన్ ట్రయాంగిల్ లోని నార్కోటిక్స్ ట్రాఫికర్స్‌పై సైనిక చర్య ప్రారంభించి,1969లో ఖున్ సాను అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ సంఘటనల ఆధారంగానే ఎన్టీఆర్-నీల్ చిత్రం రూపొందనుందని అంటున్నారు.

ప్రశాంత్ నీల్ ఇంతకముందు 'కెజిఎఫ్: చాప్టర్ 1' 'కెజిఎఫ్: చాప్టర్ 2' 'సలార్' వంటి పీరియడ్ యాక్షన్‌ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించారు. బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు దర్శకుడు కంఫర్ట్ జోన్‌ లోనే ఎన్టీఆర్ తో పీరియడ్ యాక్షన్‌ బ్యాక్ డ్రాప్ మూవీనే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. KGF ప్రాంచైజీలో కోలార్ గోల్డ్ మైన్స్, సలార్ లో ఆయుధాల రవాణా గురించి చూపించిన నీల్.. ఈసారి తారక్ తో కలిసి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ట్రాఫికింగ్ గురించి డీల్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది.

డార్క్ థీమ్ తో ఎలివేషన్ సీన్స్, హై ఇంటెన్స్ యాక్షన్, ఎమోషన్స్ తో ఆడియన్స్ మెస్మరైజ్ చేసే దర్శకుడు ప్రశాంత్ నీల్. వాటన్నిటినీ తెరపై అద్భుతంగా పండించే నటుడు జూనియర్ ఎన్టీఆర్. వాళ్లిద్దరూ కలిసి ఎలాంటి సినిమా చేయబోతున్నారు? తారక్ ను ఎలా చూపిస్తారా? అని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుందని.. తనకూ చాలా కొత్త కథ అని నీల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో NTR-Neel చిత్రం కచ్చితంగా బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుందని భావిస్తున్నారు.

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ చిత్రానికి ‘డ్రాగన్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌, నందమూరి కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. 2026 సంక్రాంతి స్పెషల్ గా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.