Begin typing your search above and press return to search.

ఈ టైం లో వాళ్లిద్దరు ఒకే వేదికమీదకొస్తే..!

ఎన్టీఆర్ కు ముందు స్టార్ డం వచ్చినా అల్లు అర్జున్ కూడా అందుకు ఏమాత్రం తక్కువ కాదని వరుస సినిమాలతో ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు.

By:  Tupaki Desk   |   10 Aug 2024 12:39 PM GMT
ఈ టైం లో వాళ్లిద్దరు ఒకే వేదికమీదకొస్తే..!
X

మన స్టార్స్ అంతా సినిమాలతో ఎంత ఫైట్ చేసుకున్నా వారి మధ్య మాత్రం మంచి స్నేహ స్వభావం ఉంటుంది. ఎంతోమంది స్టార్స్ సినిమాలతో పోటీ పడినా కూడా బయట కలిస్తే మాత్రం ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు. అంతేకాదు కొంతమంది కొన్ని వరుసలు పెట్టి మరీ పిలుచుకోవడం ఆ స్టార్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. ఇలా ప్రత్యేకంగా సినిమాలతో పోటీ పడ్డా బయట బావా అని పిలుచుకునే హీరోల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉంటారు. ఎన్టీఆర్ కు ముందు స్టార్ డం వచ్చినా అల్లు అర్జున్ కూడా అందుకు ఏమాత్రం తక్కువ కాదని వరుస సినిమాలతో ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు.


పుష్ప 1 తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అంతేకాదు ఆ సినిమాతో తెలుగు పర్శ్రమ కల అయిన బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ ని తీసుకొచ్చాడు. ఐతే ఇప్పుడు పుష్ప 2 ని సిద్ధం చేస్తున్నాడు. మరోపక్క ఎన్టీఆర్ దేవర గా రాబోతున్నాడు. సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు.

ఐతే పుష్ప 2, దేవర రిలీజ్ లకు ముందుగానే అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఒక వేడుకలో పాల్గొనబోతున్నారు. ఇద్దరు కలిసి ఒకే వేదిక షేర్ చేసుకోనున్నారని తెలుస్తుంది. ఇంతకీ ఈ ఇద్దరి కలయిక దేని కోసం అంటే ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ నటించిన ఆయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మించారు. సో అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నాడు.. మరోపక్క బామ్మర్ది కోసం ఎన్ టీ ఆర్ కూడా అటెండ్ అవనున్నాడు.

ఈ ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ మీద కనిపించనున్నారని తెలుస్తుంది. ఇదే జరిగితే మాత్రం చాలా కాలం తర్వాత ఒక ఇద్దరు మాస్ హీరోలు ఒక స్టేజ్ ని పంచుకున్నట్టు అవుతుంది. అంతేకాదు ఈ ఇద్దరు కలవడం వల్ల ఫ్యాన్స్ మధ్య ఉన్న తారతమ్యాలు కూడా తొలగిపోయి మరింత స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎన్ టీ ఆర్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా సినిమా సినిమాకు వర్సటాలిటీ చూపిస్తూ తమ బెస్ట్ ఇస్తూ వచ్చిన వారే. తప్పకుండా ఈ ఇద్దరి కలయిక ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ అందిస్తుందని చెప్పొచ్చు.