హృతిక్ ని కూడా తారక్ గిల్లుతున్నాడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లరి పిల్లొడని రాజమౌళి చెప్పే వరకూ గానీ తెలియదు.
By: Tupaki Desk | 4 May 2024 12:30 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లరి పిల్లొడని రాజమౌళి చెప్పే వరకూ గానీ తెలియదు. `ఆర్ ఆర్ ఆర్` సెట్స్ లో రామ్ చరణ్- ఎన్టీఆర్ గిల్లికజ్జాల గురించి ఆయనే రివీల్ చేసారు. సెట్లో ఇద్దరు ఒకర్ని ఒకరు గిల్లుకోవడం..ఇద్దరు వచ్చి తనని గిల్లడం...ఒకరిపై ఒకరు ఫిర్యాదులు ఇచ్చుకోవడం.. ఆ కారణంగా వాళ్లను మ్యానేజ్ చేయడం జక్కన్నకి కష్టంగా మారడం...వాళ్లిద్దరి కారణంగా షూటింగ్ 25 రోజులు వృద్ధాగా పోవడం తెలిసిందే. మరి చరణ్ -తారక్ లో ఎక్కువ అల్లరి చేసేది? ఎవరంటే తారక్ మాత్రమే.
ఓ సందర్భంలో తారక్ స్నేహితుడు రాజీవ్ కనకాల ని కూడా కారులో ఎక్కించుకుని సిటీ అంతా తిప్పి...సినిమా షూటింగ్ తీసుకెళ్లిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. అలాంటి తారక్ ఆన్ సెట్స్ లో ఉంటే ? ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అందర్నీ నవ్వించడంలో ముందుంటారు. సహనటులతోనూ అంతే సరదాగా ఉంటారు. అందరూ తెలిసిన వారే కాబట్టి సిగ్గు..మొహమాటం కూడా ఉండదు. అందులోనూ తారక్ కి అలాంటివంటే? ఏంటో కూడా తెలియదు.
అసిస్టెంట్ డైరెక్టర్లతోనూ అంతే సరదాగా ఉంటాడు తారక్. అది అతడిలో ఉన్న గొప్ప లక్షణం. అంతా సమానమే అన్న భావన ఉంది కాబట్టే! అలా ఉండగల్గుతున్నాడు. అలా ఎంత మంది స్టార్లు ఉంటారు. ఇదంతా ఒకే మరి ..తారక్ ముంబైలో కూడా హృతిక్ రోషన్ తో అంతే క్లోజ్ గా ఉంటున్నాడా? అన్నది ఆసక్తికరం. అల్లరి చేయకుండా ఉండలేని తారక్ వార్ -2 సెట్స్ లో కూడా ఇలాగే మెలుగుతున్నాడా? లేక అక్కడ మాత్రం సుద్దపూసలా ప్రవర్తిస్తున్నాడా? అంటూ కొందరడుగుతున్నారు.
తారక్ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు. వారం రోజులు కొత్తగా ఉన్నా? ఎనిమిదవరోజు అది పాత అయిపోతుంది. కలిసి పోయే తత్వం ఉన్నవారు కాబట్టి! జోకులేయడానకి కూడా పెద్దగా సమయం పట్టదు. పైగా బాలీవుడ్ హీరోలు మరింత సరదగా ఉంటారు. సినిమాలో మాత్రమే నటులుం..బయట కాదంటూ వాళ్లు ఎంతో ప్రాక్టీకల్ గా ఉంటారు. అందుకే టీవీషోల్లో స్టార్ హీరోలు పాల్గొంటే వాళ్లతో పాటు కలిసి డాన్సులు చేయడం చేస్తుంటారు. కాబట్టి తారక్ -హృతిక్ మధ్య బాండింగ్ అంతే బలపడటానికి అవకాశం ఉంది.