Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ లాంచ్ డేట్

తాజా స‌మాచారం మేర‌కు 9 ఆగస్ట్ 2024న ఈ మూవీ (#ఎన్టీఆర్ 31) ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాల కోసం భారీగా అతిథులు విచ్చేస్తార‌ని కూడా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   5 Aug 2024 5:01 PM GMT
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ లాంచ్ డేట్
X

ఎన్టీఆర్ న‌టించిన 'దేవ‌ర' త్వ‌ర‌లో విడుద‌ల‌కు వ‌స్తోంది. రెండు భాగాలుగా తెర‌కెక్కించి ఈ సినిమాని పాన్ ఇండియాలో విడుద‌ల చేయ‌డ‌మే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు కొర‌టాల బృందం. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రెండు పాట‌లు విడుద‌లై ఆకట్టుకున్నాయి. ఈ సినిమా త‌ర్వాత కూడా తార‌క్ మ‌రో పాన్ ఇండియా సినిమాలోనే న‌టించాల్సి ఉంది.

అది కూడా కేజీఎఫ్‌- కేజీఎఫ్ 2, స‌లార్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల‌తో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌శాంత్ నీల్ తో తార‌క్ భారీ ప్ర‌యోగం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాడు. తాజా స‌మాచారం మేర‌కు 9 ఆగస్ట్ 2024న ఈ మూవీ (#ఎన్టీఆర్ 31) ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాల కోసం భారీగా అతిథులు విచ్చేస్తార‌ని కూడా తెలుస్తోంది.

ఈ వేడుక‌కు ఎన్టీఆర్ స్నేహితుడు రామ్ చ‌ర‌ణ్ హాజ‌ర‌య్యేందుకు అవ‌కాశం ఉంద‌ని కూడా తెలుస్తోంది. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ కేజీఎఫ్ కోసం హోంబ‌లే పెట్టిన పెట్టుబ‌డికి రెట్టింపు బ‌డ్జెట్ ని పెట్టేందుకు సిద్ధంగా ఉంద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. ఈ సినిమాకి డ్రాగన్ అనే ఆస‌క్తిక‌ర టైటిల్ ని పెట్టార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

య‌ష్, ప్ర‌భాస్ లాంటి స్టార్ల‌ను వారి ఛ‌రిష్మా, ఎనర్జీకి త‌గ్గ‌ట్టుగా మ‌లిచిన ప్ర‌శాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ ని ఏ లెవ‌ల్లో ఆవిష్క‌రిస్తాడో ఊహిస్తేనే గూస్ బంప్స్ పుట్టుకొస్తున్నాయ్. తారక్ ని మాస్ యాక్ష‌న్ స్టార్ గా మ‌రో లెవ‌ల్లో ఆవిష్క‌రించ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. తాడిని తన్నేవాడొక‌డొస్తే వాడి త‌ల‌ద‌న్నేవాడు ఇంకొక‌డొస్తాడు! అన్న చందంగా త‌న సినిమాల్లో హీరోల పాత్ర‌ల్ని ఒక రేంజులో ఎలివేట్ చేస్తున్నాడు ప్ర‌శాంత్ నీల్. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం ఎంపిక చేసుకున్న గెట‌ప్ కానీ, యాక్ష‌న్ బ్లాక్ లు కానీ ఏ రేంజులో వ‌ర్క‌వుట‌వుతాయో చూడాల‌న్న కుతూహాలం మొద‌లైంది.