రకుల్ పెళ్లికి ఎన్టీఆర్-చరణ్?
సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత కం నటుడు జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Feb 2024 5:11 AM GMTసౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత కం నటుడు జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 21 ఫిబ్రవరి 2024న గోవాలో ఈ జంట వివాహంతో ఒకటి కానున్నారు. ఇప్పటికే పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రీవెడ్డింగ్ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఇంతకుముందే జాకీ భగ్నానీ అండ్ సింగ్ కుటుంబం ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రిక కూడా దర్శనమిచ్చింది.
పెళ్లికి ముందు ఈ జంట ముంబై సిద్ధివినాయక ఆలయంలో పూజలాచరిస్తూ కనిపించారు. ఇప్పుడు పెళ్లికి ఒక రోజు ముందు ఈ వివాహానికి హాజరయ్యే అతిథుల జాబితా గురించి ఊహాగానాలు సాగుతున్నాయి. ఇటీవల కరోనా వైరస్ ఉత్పాతం లేదు గనుక.. వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అందువల్ల బంధుమిత్రులు, సినీపరిశ్రమకు చెందిన ముఖ్యుల సమక్షంలో రకుల్- జాకీ జంట వివాహం జరగనుందని తెలిసింది. ఆసక్తికరంగా ఈ పెళ్లికి రకుల్ బెస్ట్ ఫ్రెండ్స్ ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మి హాజరవుతున్నారు. బాలీవుడ్ నుండి పలువురు సూపర్ స్టార్లు హాజరయ్యేందుకు ఆస్కారం ఉందని తెలిసింది. అక్షయ్ కుమార్, ఈషా డియోల్, టైగర్ ష్రాఫ్, సోనమ్ కపూర్, రితీష్ దేశ్‌ముఖ్, షాహిద్ కపూర్, భూమి పెడ్నేకర్, ఆనంద్ అహూజా, వరుణ్ ధావన్, నటాషా పలువురు టీవీ నటీనటులు కూడా హాజరు కానున్నారు.
టాలీవుడ్ నుంచి నాన్నకు ప్రేమతో కోస్టార్ ఎన్టీఆర్.. ధృవ కోస్టార్ రామ్ చరణ్ హాజరవుతారని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కోస్టార్ సందీప్ కిషన్ కూడా హాజరయ్యేందుకు ఆస్కారం ఉంది. తెలుగు చిత్రసీమలో రకుల్ కి గొప్ప స్నేహ సంబంధాలున్నాయి. అందువల్ల పలువురు దర్శకనిర్మాతలకు ఆహ్వానం అందేందుకు ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. బీచ్ వెడ్డింగ్ లో తెలుగు సినీప్రముఖులు ఎవరెవరు కనిపిస్తారో వేచి చూడాలి.