ఆర్డీవో ఆఫీస్ లో యంగ్ టైగర్ హల్చల్!
సాధారణంగా స్టార్ హీరోలు ఇలా పబ్లిక్ లోకి వస్తే ఎంతో అసౌకర్యానికి గురవుతారు. అభిమానుల తాకిడి కనిపిస్తుంది
By: Tupaki Desk | 2 April 2024 1:45 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్ మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఎన్టీఆర్ కొనుగోలు చేసిన రెండు కార్లు రిజిస్ట్రేషన్ కి సంబంధించి అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. అధికారులతో పనిముగించుకుని అనంతరం తిరిగి వెళ్లిపోతున్నట్లు కనిపిస్తుంది. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ బ్లాక్ టీషర్లు ధరించి...కళ్లకి నల్లటి అద్దాలు ధరించి కనిపించారు. ఈ సమయంలో తారక్ ముక్కుకి..గానీ ముఖానికి గానీ ఎలాంటి మాస్క్ వేసుకుని కనిపించలేదు.
సాధారణంగా స్టార్ హీరోలు ఇలా పబ్లిక్ లోకి వస్తే ఎంతో అసౌకర్యానికి గురవుతారు. అభిమానుల తాకిడి కనిపిస్తుంది. కానీ తారక్ సైలెంట్ వచ్చి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తారక్ ఇలా ప్రభుత్వ ఆఫీసులో కనిపించేసరికి ఏంటి ఈ సర్ ప్రైజ్ అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. అన్ని పనులు పూర్తిచేసి ఇదే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అనంతరం 'దేవర -2' షూటింగ్ మొదలవుతుంది. అలాగే మరోవైపు బాలీవుడ్ డెబ్యూ 'వార్ -2' షూటింగ్ లో అతి త్వరలోనే జాయిన్ అవుతాడు. ఇప్పటివరకూ తారక్ అధికారికంగా కమిట్ అయిన ప్రాజెక్ట్ లు ఇవే. ప్రశాంత్ నీల్ తో కూడా చర్చలు జరిపాడు. ఆ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈలోగో ప్రశాంత్ నీల్ సలార్ -2ని పూర్తి చేసి రిలీజ్ చేస్తాడు. అలాగే అర్జున్ రెడ్డి...యానిమల్ చిత్రంలో సంచలనం అయిన సందీప్ రెడ్డి వంగని కూడా తారక్ లైన్ లోకి తెస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.
కానీ ఆ కాంబో సెట్ అవ్వడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సందీప్ కూడా స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అది పూర్తిచేసి రిలీజ్ చేయడానికే రెండేళ్లు పడుతుంది. అంతవరకూ తారక్ గురించి సందీప్ ఆలోచించే అవకాశం కూడా లేదు.