'వార్ 2' తారక్ 60 రోజుల్లో ఫినిష్ చేస్తాడట
యష్ రాజ్ సంస్థ యాక్షన్ డ్రామా `వార్ 2`లో హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 March 2024 10:59 AMయష్ రాజ్ సంస్థ యాక్షన్ డ్రామా `వార్ 2`లో హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్న సంగతి తెలిసిందే. రెండు పరిశ్రమలకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లను స్క్రీన్‌పై ఒకే ఫ్రేమ్‌లో చూడాలని అభిమానులు ఇప్పటికే ఉవ్విళ్లూరుతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించిన ప్రతి అప్‌డేట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజా మీడియా కథనాల ప్రకారం.. ఇద్దరు అగ్ర హీరోలు యాక్షన్-ప్యాక్డ్ `వార్ 2` కోసం 60 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉందని తెలిసింది.
హృతిక్ ప్రస్తుతం ముంబైలో తన ఎంట్రీ సీక్వెన్స్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇది యాక్షన్-ప్యాక్డ్ స్టంట్. వార్ 2 కోసం హృతిక్ కేవలం 55 నుండి 60 రోజులు మాత్రమే కేటాయించాడు. చాలా భాగం ముంబైలోని స్టూడియోలలో చిత్రీకరిస్తున్నారు. ఆసక్తికరంగా జూన్ 2024 నాటికి వార్ 2లో హృతిక్ పాత్ర చిత్రణ పూర్తి చేయాల్సి ఉంది. అతడు రికార్డ్ సమయంలో చిత్రీకరణను ముగించే చిత్రాలలో ఇది ఒకటి. అతడు మార్చి 7న ముంబై YRFలో హృతిక్ ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించాడు.
జూనియర్ ఎన్టీఆర్ `వార్ 2` షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభించి జూలై నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. హృతిక్ లాగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా `వార్` షూటింగ్ కోసం 60 రోజులు కేటాయించారు. ఇందులో 25 నుండి 30 రోజుల పాటు హృతిక్ తో కాంబినేషన్ షూట్ ఉంటుంది. ఏప్రిల్ చివరి నుంచి ఎన్టీఆర్ షూట్ కి వెళతాడని తెలుస్తోంది. YRF ఇప్పటికే భారీ చిత్రాలను సమర్ధవంతంగా తెరకెక్కించే కళలో ప్రావీణ్యం సంపాదించింది. ఎందుకంటే ఈ టెంప్లేట్‌కు నటీనటుల నుండి ఎక్కువ రోజులు షూట్ అవసరం లేదు లేదా బడ్జెట్ భారం పెంచడం కుదరదు.
భారీ సినిమాల షూటింగ్ కోసం YRF మరింత అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తుందని పేర్కొనడం గమనార్హం. గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన వార్ 2 తాజా ఉదాహరణ. మీడియా కథనాల ప్రకారం.. అయాన్ ముఖర్జీ అసలు లీడ్ పాత్రధారులు లేకుండా ఇప్పటికే రెండు ఓవర్సీస్ షెడ్యూల్‌లను చిత్రీకరించారు. ఇది యాక్షన్ స్పేస్‌లో అవుట్‌డోర్ షూట్‌లను బాడీ డబుల్స్‌తో మేనేజ్ చేసే అత్యంత ఆధునిక సాంకేతికత.. మేకర్స్ VFX ఉపయోగించి ముఖాలను మార్చుకుంటారు! అని తెలుస్తోంది. మొత్తం షూటింగ్ జూలై నాటికి పూర్తి చేసి ఆ తర్వాత 8నెలలు కేవలం వీఎఫ్ఎక్స్ సహా నిర్మాణానంతర పనుల కోసం కేటాయిస్తారని తెలిసింది.
ఏక్ థా టైగర్ (2012), టైగర్ జిందా హై (2017), వార్ (2019), పఠాన్ (2022), టైగర్ 3 (2023) వంటి సినిమాలతో జోరుమీద ఉన్న YRF స్పై యూనివర్స్‌లో వార్ 2 ఆరవ సినిమా. ఈ చిత్రం టైగర్ 3 కి కొనసాగింపు కథాంశాన్ని ముందుకు తీసుకెళుతుంది. చివరికి మోస్ట్ అవైటెడ్ `టైగర్ వర్సెస్ పఠాన్`కి కనెక్టవుతుంది. ఈ చిట్టచివరి చిత్రం సల్మాన్ ఖాన్ - షారుక్ ఖాన్ మధ్య హోరాహోరీ వార్ నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతోంది.