Begin typing your search above and press return to search.

దేవర సాంగ్.. ఆ దరిదాపుల్లో కూడా లేదే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రం నుంచి ఫియర్ సాంగ్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది

By:  Tupaki Desk   |   21 May 2024 4:50 AM GMT
దేవర సాంగ్.. ఆ దరిదాపుల్లో కూడా లేదే..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రం నుంచి ఫియర్ సాంగ్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో దేవర నుంచి వచ్చే టైటిల్ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని అందరూ భావించారు. తమిళంలో అతని పాటలకి రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తూ ఉంటాయి.

అందుకే తెలుగులో కూడా దేవర ఫియర్ సాంగ్ తారక్ ఫ్యాన్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎలివేషన్ అదిరిపోయే రేంజ్ లో ఉందనే మాట వినిపిస్తోంది. అయితే రెగ్యులర్ శ్రోతల నుంచి మాత్రం సాంగ్ కి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సాంగ్ యుట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. కానీ వ్యూస్ పరంగా రికార్డులని టచ్ చేయలేకపోయింది.

దేవర ఫియర్ సాంగ్ 24 గంటల్లో కేవలం 5.19 మిలియన్ వ్యూస్ మాత్రమే సొంతం చేసుకుంది. తారక్ కెరియర్ లోనే 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ లో ఒకటిగా ఇది నిలిచింది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం టాప్ 10లో కూడా ఈ పాటకి స్థానం లభించలేదు. టాలీవుడ్ లో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ జాబితాలో చూసుకుంటే టాప్ 4 పాటలు మహేష్ బాబు సినిమాలలోనివే కావడం విశేషం.

17.42 మిలియన్ వ్యూస్ తో గుంటూరు కారం సినిమాలోని దమ్ మసాలా సాంగ్ టాప్ 1లో ఉంది. 16.38 మిళియన్స్ వ్యూస్ తో సర్కారువారిపాట పెన్నీ సాంగ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అదే సినిమాలో కళావతి సాంగ్ 14.78 మిలియన్ వ్యూస్ తో టాప్ 3లో ఉంది. సర్కారువారిపాటలోనే మమ మహేశా సాంగ్ 13.56 మిలియన్ వ్యూస్ తో టాప్ 4గా నిలిచింది. నెక్స్ట్ పుష్పలోని ఊ అంటావా సాంగ్ 12.39 మిలియన్ వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది.

పుష్ప 2 లోని టైటిల్ సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఏకంగా 10.38 మిలియన్ వ్యూస్ తో టాప్ 6లోకి వచ్చింది. భీమ్లా నాయక్ మూవీలో లాలా భీమ్లా సాంగ్ 10.20 మిలియన్ వ్యూస్ తో టాప్ 7గా ఉంది. ఆచార్య సానా కష్టం సాంగ్ 10.16 మిలియన్ వ్యూస్ తో టాప్ 8లో ఉండగా, మహేష్ బాబు కుర్చీ మడతపెట్టి 9.52 మిలియన్ వ్యూస్ తో టాప్ 9లో ఉంది. వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ 9.51 మిలియన్ వ్యూస్ తో టాప్ 10 లో నిలిచింది. కానీ దేవర సాంగ్ మాత్రం 5.19 మిలియన్ వ్యూవ్స్ మాత్రమే అందుకుంది. ఇక నెక్స్ట్ మెలోడీ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. దానికి ఎలాంటి రెస్పాన్స్ అందుతుందో చూడాలి.