Begin typing your search above and press return to search.

దేవర డబుల్ యాక్షన్.. కిల్లర్ లుక్స్

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు అని మొదటినుంచి అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Aug 2024 5:21 AM GMT
దేవర డబుల్ యాక్షన్.. కిల్లర్ లుక్స్
X

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు అని మొదటినుంచి అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే మొత్తానికి మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు.. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రలలో ఎలా కనిపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో మొదటి నుంచే హై రేంజ్ లో ఉంది.

ఇక స్పెషల్ పోస్టర్ ద్వారా ఆ అంచనాల స్థాయిని మరింత పెంచేశారు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఎన్టీఆర్ కు కూడా ఈ సినిమా సోలోగా పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి సినిమాలో కంటెంట్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు ప్రేక్షకుల్లో ఒక నమ్మకం అయితే ఉంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను నేడు విడుదల చేశారు. కరెక్ట్ గా సినిమా విడుదల కావడానికి నెలరోజుల సమయం మాత్రమే ఉంది. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా దేవర పార్ట్ 1 విడుదల కానుంది. ఇక పోస్టర్ లో విభిన్నమైన క్యారెక్టర్స్ కలిగిన ఫేసెస్ ను చూపించారు. ముందుగా ఉన్న మొహంలో కాస్త నవ్వుతో కూడిన ధైర్యవంతుడు కనిపించగా వెనకలో పూర్తిగా కోపంతో ఉన్న మరొక ధైర్యవంతుడు కనిపిస్తున్నాడు.

భయ పుట్టించే ఫేసెస్ అనేలా ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. మొదటి నుంచి కూడా సినిమాలో హీరో పాత్ర నెవ్వర్ బిఫోర్ అనేలా చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది అని హైలెట్ చేశారు. ముఖ్యంగా దూకే ధైర్యమ జాగ్రత్త.. అంటూ సాంగ్ లో కూడా బాగా ఎలివేట్ చేశారు. కాబట్టి ఎన్టీఆర్ ఫాన్స్ అయితే ఈ సినిమా పై చాలా నమ్మకంతో ఉన్నారు. ఇక సినిమా విడుదల డేట్ దగ్గర పడుతున్న సమయంలో ప్రమోషన్స్ హడావుడి పెద్దగా కనిపించడం లేదు అని ఓ వర్గం ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి.

ఇక ఫైనల్ గానే చిత్ర యూనిట్ ఈ పోస్టర్ ద్వారా ఒక మంచి కిక్ అయితే ఇచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే మరొక వారం రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా ప్రమోషన్స్ చేయనున్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల టార్గెట్ ను అందుకుంటుంది అని ఓ వర్గం ఫ్యాన్స్ అయితే ధీమాగా ఉన్నారు. మరి ఆ దిశగా దేవర పార్ట్ 1 సినిమా కలెక్షన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.