ఐదు షెడ్యూల్స్ పూర్తిచేసినా ఆగని 'దేవర' పోరాటం!
వర పోరాట సన్నివేశాలే ప్రధానంగా తెరకెక్కించారు. దీంతో యాక్షన్ పార్ట్ పూర్తయిందనుకున్నారంతా.
By: Tupaki Desk | 17 July 2023 5:50 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ 'దేవర' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ మాస్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా కొరాటాల మార్క్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యాక్షన్ సన్నివేశాలతో ప్రారంభమైంది. దీనిలో భాగంగా పీటర్ హెయిన్స్..కెన్నీ బేట్స్ లాంటి ప్రఖ్యాత హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.
దీంతో ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో అంచనా వేయోచ్చు. ప్రేక్షకుల ఊహకందని విధంగా భారీ పోరాట సన్నివేశాలున్నట్లు 'దేవర' హైలైట్ అవుతోంది. కొన్ని నెలలుగా హైదరాబాద్ పరిసరాల్లోనే షూటింగ్ జరుగుతోంది.
ఇప్పటివరకూ మొత్తం ఐదు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. వాటన్నింటిలోనే దేవర పోరాట సన్నివేశాలే ప్రధానంగా తెరకెక్కించారు. దీంతో యాక్షన్ పార్ట్ పూర్తయిందనుకున్నారంతా.
కానీ ఈ పోరాటం ఇంకా ఆగలేదని యూనిట్ ప్రకటనతో తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో మరో యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు యూనిట్ తెలిపింది. ఇందులోనూ టైగర్ పై భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలిపారు.
ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్ కూడా నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో వందలాది మంది పైటర్లుభాగం కానున్నట్లు సమాచారం. ఈ పైట్ సన్నివేశాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసారుట. ఇందులో చాలా క్రియేటివిటీ ఉంటుందని....దీన్ని పీటర్ హెయిన్స్ స్పెషల్ గా డిజైన్ చేసినట్లు చెబుతున్నారు.
దీంతో సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పొచ్చు. యాక్షన్ సన్నివేశాల్నే ఇన్ని నెలలు పాటు షూట్ చేసారంటే? ఇంకా పూర్తిచేయాల్సిన భాగం చాలా ఉందని తెలుస్తోంది. అందుకే ఏడాదంతా షూటింగ్ కే కేటాయించారు. 2024 ఏప్రిల్ లో సినిమా రిలీజ్ అని ముందే ప్రకటించిన నేపథ్యంలో సినిమాని కొరటాల-తారక్ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారో తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్స్ట్-యువ సుధ ఆర్స్ట్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.