దేవర.. అందరూ అప్పుడే వస్తే ఎలా?
వచ్చే ఏడాది రిలీజ్ కోసం ఇప్పటి నుంచి టాలీవుడ్ లో పోటీ వాతావరణం నెలకొంది.
By: Tupaki Desk | 13 Aug 2023 4:57 AM GMTవచ్చే ఏడాది రిలీజ్ కోసం ఇప్పటి నుంచి టాలీవుడ్ లో పోటీ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలు అన్ని కూడా ముందుగానే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటూ షూటింగ్ జరుపుకుంటాయి. అలా డేట్ ప్లాన్ చేసుకోవడం వలన రిమైండర్ లా దానిని దర్శకులు భావిస్తారు. వేగంగా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ మధ్యకాలంలో ముందుగానే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేయడం టాలీవుడ్ లో ఆనవాయితీగా వస్తోంది.
గతంలో సినిమా కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయిన తర్వాత మంచి డేట్ నిర్ణయించుకొని మూవీ రిలీజ్ చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పోటీ వాతావరణం ఎక్కువ అయిపోతుంది.ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ కూడా పెరగడంతో ఇతర భాషా చిత్రాలు కూడా తెలుగులో రాణిస్తున్నాయి. మన సినిమాలు మిగిలిన భాషలలో సత్తా చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యం అయిపొయింది.
జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ ఏప్రిల్ 4 న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే దేవర సినిమాకి పోటీగా ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తోన్న పుష్ప 2 మూవీని ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇంకా అఫీషియల్ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ఓజీ కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ అవుతుందనే ప్రచారం నడుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఒక సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ కూడా ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. రామ్ చరణ్, శంకర్ కాంబోలో సిద్ధమవుతోన్న గేమ్ చేంజర్ ని దిల్ రాజు ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు. ఇలా చూసుకుంటే ఎన్టీఆర్ కి పోటీగా ఏప్రిల్ లో ముగ్గురు మెగా హీరోలు సిద్ధమవుతున్నారు. వీరిలో ఒకరైన కచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.
ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. ఏప్రిల్ నెలలో వరుసగా సెలవులు వస్తూ ఉండటంతో దర్శకులు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకుంటున్నారు. ఈ పోటీలో ఎవరు నిలబడతారు. ఎవరు వెనక్కి వెళ్ళిపోతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.