Begin typing your search above and press return to search.

దేవర.. ఫస్ట్ సాంగ్ అలా ఉంటుందట!

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్యాన్ ఇండియా మూవీ దేవర సినిమాపై అంచనాలు మామూలుగా లేవు

By:  Tupaki Desk   |   19 Aug 2023 10:10 AM GMT
దేవర.. ఫస్ట్ సాంగ్ అలా ఉంటుందట!
X

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్యాన్ ఇండియా మూవీ దేవర సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇందులో హాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ భయంకరమైన విలన్ గా కనిపించబోతున్నాడు. ఇటీవల ఒక పోస్టర్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంకా రెగ్యులర్ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయలేదు.

కానీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే మాత్రం అసలు ఆగదని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆ విధంగా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దర్శకుడు కొరటాల శివ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈసారి ప్రమోషన్స్ విషయంలో కూడా ఎన్టీఆర్ చిత్ర యూనిట్ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. రాజమౌళి ఎలాగైతే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తో హైప్ క్రియేట్ చేస్తాడో అదే తరహాలో మన సినిమాకు ఎందుకు జరగకూడదు అనే తరహాలో ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.

అందుకే ప్రతి చిన్న అప్డేట్ కూడా బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా హార్డ్ వర్క్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ కూడా గట్టిగానే పెరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల కాలంలో అతను ఇచ్చిన సాంగ్స్ సినిమాలకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి.

అయితే ఇప్పుడు దేవర సినిమాకు అందించబోయే మొదటి సాంగ్ ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన కథలోని ప్రధానమైన ఆత్మను ఆ పాటలో హైలెట్ చేస్తారని తెలుస్తోంది. రామజోగయ్య శాస్త్రి రచనలో రాబోతున్న ఆ పాటలో దేవర చుట్టూ ఉండే ప్రపంచం అలాగే అతని పాత్రను హైలైట్ చేస్తూ లిరిక్స్ ఉంటాయట.

కొరటాల శివ ఈ సినిమా మ్యూజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా అన్ని భాషల్లో కూడా పాటలు సక్సెస్ అయ్యేలా కూడా ప్లాన్ అయితే చేసుకుంటున్నారు. మరి అనిరుద్ ఆడియెన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో చూడాలి. ఇక దేవర సినిమా షూటింగ్ను ఈ ఏడాది చివరికి ఫినిష్ చేసి 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.