'దేవర'.. ఆ దేవత భక్తుడిగా ఎన్టీఆర్!
2024 లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఎన్టీఆర్ 'దేవర' కూడా ఒకటి
By: Tupaki Desk | 25 Dec 2023 11:49 AM GMT2024 లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఎన్టీఆర్ 'దేవర' కూడా ఒకటి. 'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న రెండో ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' మంచి విజయాన్ని అందుకోవడంతో దేవర సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సోషల్ మెసేజ్ తో వచ్చిన జనతా గ్యారేజ్ కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈసారి వీరి కాంబినేషన్లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. కొరటాల శివ అత్యంత భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం కెన్నీ బెట్స్ లాంటి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ మూవీతో తెలుగు వెండితెరకి హీరోయిన్గా పరిచయం అవుతుంది.
బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్ గంగమ్మ తల్లి భక్తుడుగా కనిపించబోతున్నారట. ప్రస్తుతం గంగమ్మ జాతరకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. గంగమ్మ జాతరలో ఓ భారీ ఫైట్ సీన్ కూడా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
ఈ సీన్ సినిమా మొత్తానికి హైలెట్ అవుతుందని చిత్ర యూనిట్ అంటుంది. అంతేకాదు ఈ గంగమ్మ జాతర ఎపిసోడ్లో ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ అని చెబుతున్నారు. కాగా ఈమధ్య అగ్ర హీరోల సినిమాల్లో జాతర ఎపిసోడ్లు ఓ ట్రెండ్ అయిపోయాయి. రీసెంట్ గానే 'పుష్ప2' మూవీలోనూ గంగమ్మ జాతర ఎపిసోడ్ ని సుకుమార్ చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు. 'పుష్ప 2' ఇంటర్వెల్ బ్యాంగ్‌లో పోలేరమ్మ జాతర ఎపిసోడ్ ఉంటుందట.
అందులో బన్నీ అమ్మోరు వేషధారణలో కనిపించనున్నారు. అంతేకాదు ఆ సమయంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. చాలా రోజుల క్రితమే ఈ ఎపిసోడ్ ని షూట్ చేశారు. ఇక ఇప్పుడు దేవర మూవీలో కూడా ఇలాంటి సీక్వెన్స్ ని కొరటాల శివ ప్లాన్ చేయడం విశేషం. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.