Begin typing your search above and press return to search.

దేవర డిస్ట్రబ్ అవుతున్నాడా..?

ఈ సమ్మర్ లో ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేయగా సినిమా రిలీజ్ విషయంలో హడావిడి ఎందుకని ఏప్రిల్ రిలీఎక్ స్కిప్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   2 Feb 2024 5:51 AM GMT
దేవర డిస్ట్రబ్ అవుతున్నాడా..?
X

ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వతున్న సినిమా దేవర. కాంబినేషన్ ఓకే అయ్యాక కూడా తారక్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు చాలా టైం తీసుకున్నాడు. కథ పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాతే సినిమాను మొదలు పెట్టాలని ఎన్.టి.ఆర్ అలా ప్లాన్ చేశాడు. దేవర మొదలై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా కొంత పార్ట్ షూటింగ్ కాగానే అవుట్ పుట్ చూసి సూపర్ అనుకున్న మేకర్స్ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఈ సమ్మర్ లో ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేయగా సినిమా రిలీజ్ విషయంలో హడావిడి ఎందుకని ఏప్రిల్ రిలీఎక్ స్కిప్ చేస్తున్నారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ కొరటాల శివకు ఎనిమిదేళ్లుగా వెంటాడుతున్న ఒక ఇష్యూ గురించి ఇప్పుడు మళ్లీ అతనికి తలనొప్పిగా మారింది. శ్రీమంతుడు కథ విషయంలో మరో రైటర్ వేసిన కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు.

లేటెస్ట్ గా సుప్రీం కోర్టు కూడా కొరటాల శివ విచారణకు హాజరు కావాలనే చెప్పింది. ఈ గొడవ వల్ల దేవర మీద ఫోకస్ చేయాల్సిన కొరటాల శివ కొంత డిస్ట్రబ్ అవుతున్నాడని తెలుస్తుంది. సినిమా ఇప్పటికే వి.ఎఫ్.ఎక్స్ వర్క్ గురించి ఏప్రిల్ల్ నుంచి మరో 3, 4 నెలలు వాయిదా వేయాలని అనుకున్న మేకర్స్ కొరటాల శ్రీమంతుడు ఇష్యూ మరింత లేట్ అయ్యేలా చేస్తుంది.

ఈ ఇష్యూ మీద కొరటాల నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారట. దేవర విషయంలో అతని కాన్సెంట్రేషన్ ని తగ్గకుండా చూస్తున్నారట. ఆల్రెడీ కొరటాల శివతో జనతా గ్యారేజ్ సినిమా చేసిన తారక్ మళ్లీ దేవరతో కలిసి పనిచేస్తున్నాడు. దేవర ఫస్ట్ లుక్ టీజర్ అంచనాలను మించి అనిపించగా సినిమాను కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కాకపోతే మధ్యలో కొరటాల శివ ఇష్యూ వల్ల కొంత డిస్టబన్స్ వస్తున్నట్టు తెలుస్తుంది.

దేవర సినిమాలో తారక్ తో జాన్వి కపూర్ జత కడుతుంది. సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా వేరే లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ దేవర సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ ఏర్పడింది.