Begin typing your search above and press return to search.

దేవర.. ఎన్టీఆర్ కోసం RRR రేంజ్ లోనే!

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. దాదాపు దేవర టాకీ పార్టీ మొత్తం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   25 Jun 2024 11:30 PM GMT
దేవర.. ఎన్టీఆర్ కోసం RRR రేంజ్ లోనే!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకొని చేస్తోన్న మాసివ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ దేవర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. దాదాపు దేవర టాకీ పార్టీ మొత్తం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇంకా హీరో, హీరోయిన్స్ మీద చిత్రీకరించాల్సి సాంగ్స్ పెండింగ్ ఉన్నాయంట. ఇదిలా ఉంటే ఈ మూవీని మొదట అక్టోబర్ 10 కి రిలీజ్ చేయాలనుకున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా సెప్టెంబర్ 27వ డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు.

అంటే ముందు అనుకున్న డేట్ కంటే రెండు వారాలు ముందుగానే దేవర సినిమా రిలీజ్ ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కొరటాల మూవీ కోసం చాలా స్పీడ్ గా వర్క్ చేస్తుననారంట. ఈ సినిమాకి కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్ అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది.

దీంతో మూవీపైన అంచనాలు పెరిగాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి రాబోయే పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. కొరటాల శివ కూడా వారి అంచనాలని అందుకునే స్థాయిలోనే అవుట్ పుట్ రెడీ చేస్తున్నారంట. తారక్ కూడా దేవర మూవీ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ బిజినెస్ చాలా వరకు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంట ఈ సినిమా రెండు పాటలు మరింత స్పెషల్ గా ఉంటాయట. అందులో ఎన్టీఆర్ డాన్స్ తో ఇరగదీస్తాడు అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. తారక్ రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ లో నాటునాటు పాటకి వేసిన స్టెప్పులు ఎవరు కూడా మరిచిపోరు. ఈ సినిమా అంతకు మించి హైఎనర్జిటిక్ సాంగ్స్ ని అనిరుద్ కంపోజ్ చేసారంట. ఈ సాంగ్స్ కచ్చితంగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటాయనే మాట వినిపిస్తోంది.

ఇందులో హీరోయిన్ జాన్వీ కపూర్ తో ఒక డాన్స్ నెంబర్ ఉంటుందంట. అయితే మాస్ యాక్షన్ కథలపైన ఫోకస్ చేసిన తర్వాత మన హీరోలు డాన్స్ లు చేయడం తగ్గించేశారు. కానీ తారక్ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది డాన్స్. దీనిని దృష్టిలో ఉంచుకొని కొరటాల, అనిరుద్ కలిసి అదిరిపోయే డాన్స్ సాంగ్స్ ని ప్లాన్ చేసారంట. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించాడు. అలాగే ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ, శ్రీకాంత్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.