Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ డ్రాగన్.. అసలు ప్లానేంటి..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ పూర్తి చేసి నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ చేసే పనిలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   6 Aug 2024 5:11 AM GMT
ఎన్టీఆర్ డ్రాగన్.. అసలు ప్లానేంటి..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ పూర్తి చేసి నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే హిందీలో ఎన్టీఆర్ వార్ 2 మూవీ చేస్తున్నారు. ఈ నెలలోనే వార్ 2 సెకండ్ షెడ్యూల్ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటాడనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమాని కూడా స్టార్ట్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ లో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీ రాబోతోంది. NTR31 చిత్రంగా ఎనౌన్స్ అయిన ఈ సినిమాకి డ్రాగన్ టైటిల్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నారు.

సలార్ తో పాటే ఎన్టీఆర్ 31 సినిమాని కూడా ప్రశాంత్ నీల్ ఎనౌన్స్ చేశారు. సలార్ మూవీ గత ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీని తర్వాత సలార్ పార్ట్ 2 ప్రశాంత్ నీల్ పూర్తి చేస్తాడని అందరూ భావించారు. ఈ ఏడాదిలోనే సలార్ 2 కంప్లీట్ చేసి 2025లో రిలీజ్ చేస్తారని ఎక్స్ పెక్ట్ చేశారు. మరి ప్లానింగ్ ఎందుకు మారిందనేది తెలియదు. కానీ సలార్ సీక్వెల్ కంటే ముందుగా ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాని ప్రశాంత్ నీల్ పట్టాలు ఎక్కించబోతున్నారంట.

ఇప్పటికే మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయి క్యాస్టింగ్ సెలక్షన్ జరుగుతుందంట. ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో మూవీ ఉంది. ఆగష్టు నెలలోనే ఈ సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ ని కూడా ఇప్పటికే ఖరారు చేశారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఫిల్మ్ సర్కిల్ లో నడుస్తోన్న ప్రచారం బట్టి ఈ వీక్ లోనే డ్రాగన్ మూవీ లాంచ్ అయ్యే అవకాశం ఉందంట. అలాగే ఈ నెల ఆఖరు లేదంటే వచ్చే నెల నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందంట.

ఈ సినిమా తర్వాత వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 2 మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే ఛాన్స్ ఉందంట. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ మూవీతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాని కంప్లీట్ చేయనున్నాడు. వీటి తర్వాత సలార్ 2 కోసం డేట్స్ కేటాయించనున్నాడంట. అంటే ప్రశాంత్ నీల్ నుంచి రాబోయే డ్రాగన్, సలార్ 2 చిత్రాలని ప్రేక్షకులు చూడాలంటే 2026 వరకు ఎదురుచూడాల్సిందే అనే మాట వినిపిస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న దేవర చిత్రాన్ని సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి తీసుకొని రాబోతున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగానే తెరకెక్కుతోంది. దేవర పార్ట్ 1న రిలీజ్ అయిన తర్వాత వార్ 2, డ్రాగన్ మూవీస్ ఫినిష్ చేసి దేవర పార్ట్ 2 సినిమాని తారక్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందంట.