Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ మళ్ళీ పదేళ్ళ తరువాత ఇలా..

ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ తో మూవీ కోసం షూట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ 2026 జనవరి 9న ఉంటుందని డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు.

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:26 AM GMT
ఎన్టీఆర్ మళ్ళీ పదేళ్ళ తరువాత ఇలా..
X

సంక్రాంతి అంటే స్టార్ హీరోలకి పండగే అని చెప్పాలి. ఆ టైంలో మూవీ రిలీజ్ చేస్తే మినిమమ్ బాగుందనే టాక్ వచ్చిన కమర్షియల్ సక్సెస్ గ్యారెంటీ అని నమ్ముతారు. అలాగే చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. తెలుగు ప్రజలు అందరూ కూడా సంక్రాంతి సీజన్ లో థియేటర్స్ లో మూవీస్ చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా పల్లెటూరి జనాలు అయితే విపరీతంగా సంక్రాంతి సీజన్ లో సినిమాలు చూస్తారు.

అందుకే స్టార్ హీరోలు అందరూ ఆ సీజన్ ని లక్ష్యంగా చేసుకొని తమ సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం మూవీ క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నారు.

ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ తో మూవీ కోసం షూట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ 2026 జనవరి 9న ఉంటుందని డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. 2026 సంక్రాంతి రేసులోకి పోటీ పడబోతున్న మొదటి సినిమాగా డ్రాగన్ మూవీ నిలిచింది. దశాబ్ద కాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరల సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. చివరిగా నాన్నకు ప్రేమతో సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యింది.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. దీని తరువాత జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ మొదటి సారి నాగ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.

తరువాత నా అల్లుడు సినిమా కూడా సంక్రాంతి ఫెస్టివల్ కానుకగానే రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన అదుర్స్ మూవీస్ సంక్రాంతి ఫెస్టివల్ కి థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమా తారక్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లలో ఒకటిగా నిలిచింది. ఇందులో చారి క్యారెక్టర్ లో తారక్ పండించిన కామెడీ మూవీకి పెద్ద అస్సెట్ అయ్యింది.

ఆ తరువాత నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టాడు. 2026లో కూడా డ్రాగన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ప్రశాంత్ నీల్ కూడా మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న నేపథ్యంలో కచ్చితంగా డ్రాగన్ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.