Begin typing your search above and press return to search.

దేవర కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా దేవర

By:  Tupaki Desk   |   16 Jun 2024 7:08 AM GMT
దేవర కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు..?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా దేవర. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే దేవర నుంచి గ్లింప్స్ తో పాటు ఒక సాంగ్ రిలీజ్ కాగా ఆ రెండు సినిమాపై హైప్ ని డబుల్ చేశాయి. ఐతే సినిమా రిలీజ్ ని అక్టోబర్ 10 నుంచి సెప్టెంబ 27కి ప్రీ పోన్ చేసిన మేకర్స్ మళ్లీ అప్డేట్స్ విషయంలో వెనకపడుతున్నారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

దేవర నుంచి మరో టీజర్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ని అలా పోస్టర్ గా కాకుండా ఒక టీజర్ తో వదిలితే బాగుంటుందని అంటున్నారు. ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన దేవర సినిమా నుంచి మేకర్స్ లో అప్డేట్స్ ఇవ్వడం ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తుంది. సినిమా గురించి ఆడియన్స్ అంతా మాట్లాడుకోవాలంటే ఒకదాని వెంట ఒకటి అప్డేట్ ఇవ్వాలి. కానీ దేవర టీం మాత్రం ఆ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ మాత్రం ఈ వెయిటింగ్ అంతా కూడా థియేటర్ లో సినిమా చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారని చెబుతుండగా ముందు అప్డేట్స్ కావాల్సిందే అని ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. దేవర సినిమా అక్టోబర్ 10 నుంచి సెప్టెంబర్ 27 అంటే రెండు వారాలు ముందు రిలీజ్ అవుతున్న సంతోషం కూడా ఫ్యాన్స్ లో కనిపించట్లేదు. దేవర టీం ఇలానే చేస్తే సినిమాకు ఊహించని నష్టం జరుగుతుంది. అందుకే సినిమా ప్రమోషన్స్ మీద బాగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

దేవర సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో తన మాస్ స్టామినా చూపించేందుకు వస్తున్నాడు ఎన్టీఆర్ . ఈ సినిమా గురించి ఎవరేం అనుకుంటున్నా ఎన్టీఆర్ మాత్రం ప్రతి ఒక్క అభిమాని కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని అంటున్నాడు. మరి ఆ రేంజ్ కాన్ ఫిడెంట్స్ తారక్ లో ఉంది అంటే సినిమా తప్పకుండా అంచనాలను మించి ఉంటుందని చెప్పొచ్చు. సెప్టెంబర్ 27న ఎన్టీఆర్ సృష్టించే సంచలనాలకు ప్రతి అభిమాని ప్రత్యక్ష సాక్షిగా ఉండాలని భావిస్తున్నారు.