Begin typing your search above and press return to search.

తారక రాముడికి అలాంటి ఒక సినిమా..!

ఎన్టీఆర్ ని అలా రామాయణ, మహాభారత పాత్రల్లో చూడాలని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

By:  Tupaki Desk   |   20 July 2024 5:35 AM GMT
తారక రాముడికి అలాంటి ఒక సినిమా..!
X

నవరసాలను పండించగల తెలుగు స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ది ప్రత్యేకమైన శైలి ఉంటుంది. కెరీర్ మొదట్లోనే మాస్ ఆడియన్స్ కు దగ్గరైన తారక్ తన యాక్షన్ సీన్స్, ఎమోషన్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. ఇక యాక్షన్ మాత్రమేనా డ్యాన్స్ కూడా అంటూ తన స్టెప్పులతో అదరగొట్టేశాడు. కెరీర్ లో ఒక్కోమెట్టు ఎక్కుతూ మాన్ ఆఫ్ మాసెస్ గా తన స్టామినా చూపిస్తున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఐతే ఈమధ్య వెండితెర మీద సోషియో ఫాంటసీ, మైథలాజికల్ స్టోరీలకు ఎక్కువ గిరాకీ పెరిగింది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఇతిహాస కథలను తెర రూపం ఆవిష్కరిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఐతే ఇప్పటికే కెరీర్ లో అలాంటి ఒక అటెంప్ట్ చేసిన ఎన్టీఆర్ నుంచి అలాంటి ఒక సినిమా ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాతోనే తన ఆహార్యం డిక్షన్ తో అదరహో అనిపించాడు.

ఇప్పుడు అందరు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్న టైం లో ఎన్టీఆర్ నుంచి కూడా అలాంటి ఒక మూవీ ఆశిస్తున్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. ఎన్టీఆర్ ని అలా రామాయణ, మహాభారత పాత్రల్లో చూడాలని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి సినిమాల్లో ఎన్టీఆర్ చెప్పే లెంగ్తీ డైలాగ్స్ కోసం కూడా అలాంటి ఒక సినిమా పడాలని కోరుతున్నారు.

ప్రస్తుతం దేవర, వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాతో మరో 3, 4 ఏళ్లు టైం ఇచ్చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఏదైనా ఇలాంటి ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది. రాజమౌళి మహాభారతం చేస్తే అందులో కచితంగా ఎన్టీఆర్ ఉంటాడు. మరి తారక్ ని ఏ పాత్రలో జక్కన్న చూపిస్తాడన్నది తెలియదు కానీ ఆ సినిమా వస్తే మాత్రం ఊహలకు కూడా అందని రేంజ్ లో రికార్డులు సృష్టిస్తాయి. రాజమౌళి కాకపోయినా ఎవరైనా అలాంటి ఒక ఎగ్జైటింగ్ స్క్రిప్ట్ తో వచ్చినా చేసేందుకు తారక్ ఆసక్తి చూపిస్తాడని చెప్పొచ్చు. ఐతే ఎన్టీఆర్ అలాంటి సినిమా చేయాలని ఇప్పుడు అనుకున్నా కూడా ఐదేళ్ల తర్వాతే అది సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంటుందని అర్థమవుతుంది.