Begin typing your search above and press return to search.

మొన్నటిదాకా ప్రభాస్ ఫ్యాన్స్.. ఇప్పుడు వాళ్ల వంతు..?

స్టార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి ఆ హీరో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.

By:  Tupaki Desk   |   22 July 2024 6:56 AM GMT
మొన్నటిదాకా ప్రభాస్ ఫ్యాన్స్.. ఇప్పుడు వాళ్ల వంతు..?
X

స్టార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి ఆ హీరో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. సినిమా గురించి ఏదో ఒక అప్డేట్ వస్తేనే కానీ ప్రశాంతంగా నిద్రపోరు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ విషయంలో లేట్ చేస్తే తమ హీరోని దర్శక నిర్మాతలు కలిసి మోసం చేస్తున్నారని కూడా అనుకుంటారు. ఎక్కువగా ప్రభాస్ సినిమాల గురించి మేకర్స్ చాలా తక్కువ అప్డేట్స్ ఇస్తుండటం వల్ల రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఆ ప్రొడక్షన్ హౌస్ మీద.. డైరెక్టర్ మీద రకరకాల ట్రోల్స్ చేస్తుంటారు.


కల్కి సినిమా రిలీజ్ టైం లో కూడా ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ చేయలేదని రెబల్ ఫ్యాన్స్ అంతా దర్శక నిర్మాతల మీద ఫైర్ అయ్యారు. కానీ కల్కి చూశాక సినిమా గురించి ఎక్కువగా చెప్పకపోవడం వల్లే ఆ విజువల్ వండర్ ని ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. ఐతే నిన్నటి దాకా ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన హంగామా పూర్తి కాగా ఇప్పుడు ఆ బాధ్యత ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ తీసుకున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న దేవర సినిమా అప్డేట్స్ లో చిత్ర యూనిట్ చాలా నెమ్మదిగా ప్రవర్తిస్తుంది.

సినిమా నుంచి ఇప్పటివరకు ఒక టీజర్, ఒక సాంగ్ మాత్రమే వచ్చాయి. సెప్టెంబర్ 27న రిలీజ్ అని ప్రకటించగా సినిమాకు సంబందించిన ఎలాంటి అప్డేట్స్ వదలట్లేదు. ఐతే దేవర నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయాల్సి ఉన్నా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ వల్ల అది లేట్ అవుతుందని తెలుస్తుంది. సాంగ్ రాలేదు సరే కనీసం పోస్టర్స్ తో ఐనా ఫ్యాన్స్ ని శాంతిపచేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నించలేదు.

దేవర సినిమా ముందు ఒక ప్రాజెక్ట్ గానే చేయాలని అనుకున్నా సినిమా బాగా వస్తుండటం వల్ల రెండు భాగాలుగా చేస్తున్నారు. దేవర 1 సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు. సినిమా అసలైతే సమ్మర్ లోనే రావాల్సి ఉన్నా కుదరలేదు. ఐతే ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ డేట్ మిస్ అవ్వకూడదని అనుకుంటున్నారు. ఆచార్య తో మెగా ఫ్లాప్ మూటకట్టుకున్న కొరటాల శివ దేవరతో తన దమ్ము చూపించాలని చూస్తున్నడు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేసిన దేవర రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. దేవరతో పాటుగా తారక్ హృతిక్ తో కలిసి వార్ 2 లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. దేవర, వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్.టి.ఆర్ సినిమా చేయాల్సి ఉంది.