టైగర్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలైంది!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కొరటాల తెరపై ఎలా చూపించబోతున్నాడో? ఇప్పటికే అభిమానులకు ఓ అంచనా దొరికేసింది.
By: Tupaki Desk | 3 Jan 2024 2:30 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కొరటాల తెరపై ఎలా చూపించబోతున్నాడో? ఇప్పటికే అభిమానులకు ఓ అంచనా దొరికేసింది. టైగర్ మాస్ లుక్..ఆహార్యం..పాత్ర కోసం అతను సన్నదమైన విధానం ప్రతీది దేవరపై అంచ నాలు అంతకంతకు రెట్టింపు చేస్తున్నాయి. మొట్ట మొదటి పోస్టర్ తోనే దేవర ఎలా ఉండబోతుంది? అర్దమైంది. అటుపై రిలీజ్ అయిన ఒక్కో పోస్టర్ అంతకంతకు హైప్ పెంచేసింది.
అటుపై సెట్స్ నుంచి లీకులు...అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ లాంటివి సినిమాలో కొత్తగా ఉండబోతు న్నాయని..దేవర కోసం సరికొత్త ప్రపంచాన్నే కొరటాల సృష్టిస్తున్నాడని అర్దమైంది. తమ మార్క్ యాక్షన్ ని మరింత సానబెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొరటాలకి సైతం ఇది కొత్త రకమైన అనుభవం. ఇంతవ రకూ ఇండియన్ తెరపై ఇలాంటి పాయింట్ ని ఏ డైరెక్టర్ టచ్ చేయలేదని తెలుస్తోంది.
విజువల్ గా సినిమాని నెక్స్ట్ లెవల్లో హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సముద్ర గర్భంలో జరిగే యాక్షన్ సన్నివేశాలు ఓ కొత్త అనుభూతినిస్తాయని యూనిట్ తొలి నుంచి గట్టిగానే ప్రచారం చేస్తోంది. అందుకు తగ్గట్టే యూనిట్ శ్రమిస్తుంది. ఆ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా సెట్ వేయడం...కోట్ల రూపాయలు ఖర్చు చేయడం.. అత్యంత ఖరీదైన అలెక్స్ ఏఎల్ ఎఫ్ లాంటి..అర్రీ సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ లాంటి కెమెరా టెక్నాలజీ వాడటం విశేషం.
ఇంతవరకూ ఈ టెక్నాలజీ ని ఏ సినిమా కోసం వాడలేదు. తొలిసారి దేవర కోసం కొరటాల ఈ టెక్నాలజీని దించారు. అలాగా విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించడం.. ఇలా ప్రతీది దేవరని ఆకాశంలో కూర్చబెట్టింది. ఇక ఈనెల 8న టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సమయం కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఐదు రోజులే సమయం ఉండటంతో కౌంట్ టౌన్ మొదలైంది.