Begin typing your search above and press return to search.

దేవర.. ఆయుధ పూజ కోసమే వెయిటింగ్

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇప్పటికే మొదలుపెట్టారు.

By:  Tupaki Desk   |   26 July 2024 5:48 AM GMT
దేవర.. ఆయుధ పూజ కోసమే వెయిటింగ్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ మూవీని రెండు భాగాలుగా కొరటాల శివ తెరకెక్కించబోతున్నారు. దేవర పార్ట్ 1 ఆగస్టు 27న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇప్పటికే మొదలుపెట్టారు. అందులో భాగంగా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. హీరో క్యారెక్టర్ ఎలివేషన్ తో వచ్చిన ఫియర్ సాంగ్ జనాలకి బాగా రీచ్ అయ్యింది. నెక్స్ట్ దేవర నుంచి సెకండ్ సింగిల్ గా రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారంట. ఫిమేల్ వాయిస్ తో ఈ సాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ పాటకి బాస్కో మార్టీస్ కొరియోగ్రఫీ అందించారు.

థర్డ్ సింగిల్ గా అదిరిపోయే డాన్స్ నెంబర్ ని రిలీజ్ చేయనున్నారంట. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ డాన్స్ అద్భుతంగా ఉంటుందనే మాట వినిపిస్తుంది. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేశారంట. ఈ రెండు రోజుల్లోనే ఆ పాటకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇందులో తారక్ డ్యాన్స్ ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే అవకాశం ఉంది. ఇక ఫోర్త్ సింగిల్ గా ఆయుధ పూజ సాంగ్ ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రాజు సుందరం మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఈ ఆయుధ పూజ సాంగ్ పవర్ ఫుల్ ఎలివేషన్ తో ఉంటుందనే మాట వినిపిస్తుంది.

ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే మూడు పాటలు సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచుతాయనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ మూడు సాంగ్స్ ని వేర్వేరు సిటీస్ లో చిన్న చిన్న ఈవెంట్స్ లా ప్లాన్ చేసి లాంచ్ చేయబోతున్నారంట. అలాగే ట్రైలర్ లాంచింగ్ ని ఓ పెద్ద ఈవెంట్ గా నిర్వహించబోతున్నారంట. దేవర మూవీ రిలీజ్ కి ముందు సినిమాకి వీలైనంత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం ఈ ఈవెంట్స్ తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరియర్ లోనే ప్రతిష్టాత్మకంగా 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఖచ్చితంగా వరల్డ్ వైడ్ గా దేవర మూవీ వండర్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. బలమైన కథ పడితే జూనియర్ ఎన్టీఆర్ తన పెర్ఫార్మన్స్ తో దాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తాడని కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా పాన్ ఇండియా లెవెల్ లో తన మార్కెట్ ని పెంచుకోవడానికి దేవర మూవీ హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందనే దానిపై జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల మార్కెట్ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే మూవీ బిజినెస్ వరల్డ్ వైడ్ గా కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తుంది. సుమారు 400 కోట్ల వ్యాపారం దేవర సినిమాపై జరిగిందనే టాక్ వినిపిస్తోంది.