Begin typing your search above and press return to search.

హృతిక్ రోషన్ ను కొట్టాలంటే తారక్ ఆమాత్రం కష్టపడాల్సిందే!

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన డేట్స్ కూడా ఫైనల్ అయ్యాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు

By:  Tupaki Desk   |   2 April 2024 12:24 PM GMT
హృతిక్ రోషన్ ను కొట్టాలంటే తారక్ ఆమాత్రం కష్టపడాల్సిందే!
X

జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి వార్ 2 సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన డేట్స్ కూడా ఫైనల్ అయ్యాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు.

దాదాపు ఈ సినిమా షూటింగ్ కోసమే 60 రోజుల డేట్స్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. అందుకు ఆ నిర్మాణ సంస్థ పారితోషకం కూడా గట్టిగానే ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక సినిమాలో హృతిక్ రోషన్ మెయిన్ లీడ్ లో కనిపిస్తూ ఉండగా జూనియర్ ఎన్టీఆర్ అతనికి దీటుగా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. తారక్ పాత్రలో కొంత నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని ఇదివరకే కొన్ని లీక్స్ వచ్చాయి.

ఇక అతను ఒక రా ఏజెంట్ గా కనిపిస్తాడని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయని చెప్పవచ్చు. ఇద్దరి మధ్యలో ఫ్యాన్స్ కోరుకునే సాంగ్ అలాగే హై వోల్టేజ్ డాన్స్ కూడా ఉంటుంది అని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా RRR లో ఏ తరహాలో స్టెప్పులు వేశారు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక వార్ 2 సినిమాలో కూడా దాదాపు అదే తరహాలో ఇద్దరు పోటా పోటీగా డాన్స్ చేస్తారని సమాచారం. ఇక ఈ ఇద్దరి మధ్యలో వచ్చే యాక్షన్స్ సన్నివేశాలు కూడా అంతే బలంగా ఉంటాయట. ఇక హృతిక్ ఇప్పటికే ఫిట్నెస్ తో బలంగా కనిపిస్తాడు. ఇక అతన్ని ఎదుర్కొనే పాత్రలో కనిపిస్తున్నాడు కాబట్టి ఎన్టీఆర్ కూడా చాలా బలంగా కనిపించాలి. అందుకే ఇప్పుడు ఉన్న ఫిట్నెస్ కంటే మరింత ఎక్కువ స్థాయిలో బలంగా కనిపించేందుకు తారక్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

దాదాపు రెండు వారాలపాటు జూనియర్ ఎన్టీఆర్ ఒక విదేశీ ఫిట్నెస్ ట్రైనర్ తో కలిసి వర్కౌట్స్ చేయబోతున్నారు. ఇప్పటికే దేవర సినిమా షూటింగ్ చాలావరకు ఫినిష్ అయింది. ఇక ఆ సినిమాకు సంబంధించిన సన్నివేశాలకు ఇప్పుడున్న ఫిట్నెస్ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు దేవర లుక్ లో కంటే మరింత పవర్ఫుల్ గా వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ బాడీని బిల్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా హృతిక్ రోషన్, తారక మధ్యలో సన్నివేశాలు మామూలుగా ఉండవని అర్థమవుతుంది. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసే వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని అని అనుకుంటున్నారు.