Begin typing your search above and press return to search.

'వార్-2' కోసం తార‌క్ అప్పుడే బ‌రిలోకా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో `వార్-2` సినిమాతో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Sep 2023 1:30 PM GMT
వార్-2 కోసం తార‌క్ అప్పుడే బ‌రిలోకా?
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో `వార్-2` సినిమాతో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హృతిక్ రోష‌న్ తో క‌లిసి న‌టిస్తున్నారు. మ‌రి తార‌క మ‌రో హీరోనా? పవ‌ర్ ఫుల్ విల‌నా? అన్న‌ది ఇంకా క్లారిటీ లేదు. వ‌చ్చే ఏడాది వ‌ర‌కూ ఆ విష‌యాలేవి అధికారికంగా వెల్ల‌డి కావు. ఈ నేప‌థ్యంలో తారక్ పాత్ర గురించి బాలీవుడ్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంది. ఎన్టీఆర్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారుట‌.

ధూమ్ సిరీస్‌లోని విలన్ తరహాలో ఆ రోల్ ఉంటుందంటున్నారు. అలాగా చాలా స్టైలిష్ గా ఆ పాత్ర ని డిజైన్ చేస్తున్న‌ట్లు సోర్సెస్ ద్వారా లీకైంది. అలాగే తార‌క్ కోసం ద‌ర్శ‌కుడ ఆయాన్ ముఖ‌ర్జీ అప్పుడే హైద‌రాబాద్ లో తిష్ట వేసిన‌ట్లు వినిపిస్తుంది. ఇప్ప‌టి నుంచి తార‌క్ ని ప్రిపేర్ చేసే ప‌నిలో ఆయాన్ ప‌డ్డాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం తారక్ `దేవ‌ర` లోన‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఖాళీ స‌మ‌యంలో వార్ -2 కి అవ‌స‌ర‌మైన ఇన్ పుట్స్ తార‌క్ ద‌ర్శ‌కుడి నుంచి తీసుకుంటున్నారుట‌.

తార‌క్ కోరిక మేర‌కే కొన్ని రోజుల పాటు ఆయాన్ హైదరాబాద్ లో ఉంటున్నార‌ని వినిపిస్తుంది. అదే నిజ‌మైతే తార‌క్ `వార్-2` వ‌ర్క్ మొద‌లు పెట్టిన‌ట్లే. ఇప్ప‌టికే హృతిక్ వార్-2 ప‌నుల్లో బిజీ అయిన సంగ‌తి తెలిసిందే.ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా! ఆయ‌న్ నిర్వ‌హిస్తోన్న వ‌ర్క్ షాప్స్కి అటెండ్ అవుతున్నారు. ఫిజిక్ ప‌రంగా మ‌రింత రాటు దేలుతున్నారు.జిమ్ లో అద‌నంగా టైమ్ కేటాయిస్తున్నారు.

ఇలా సీనియ‌ర్ బిజీ అవ్వ‌డం తోనే జూనియ‌ర్ కూడా త‌గ్గేది లేద‌ని షురూ చేసిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం తార‌క్ భారీగా పారితోషికం ఛార్జ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఏకంగా 50 కోట్ల వ‌ర‌కూ పారితోషికం తీసుకుంటున్నారుట‌. ఈ పారితోషికం ఆయ‌న అడ‌గ‌కుండా చిత్ర నిర్మాణ సంస్థ య‌శ రాజ్ ఫిలింస్ తార‌క ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కోట్ చేసిన‌ట్లు టాక్. `ఆర్ ఆర్ ఆర్` తో దేశాన్నే ఊపేసిన స్టార్ తార‌క్. ఆ మాత్రం లేక‌పోతే ఎలా.