Begin typing your search above and press return to search.

బాలీవుడ్.. మనోళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే..

సూపర్ స్టార్ రజినీకాంత్ బాలీవుడ్ లో సినిమాలు చేసినా ఆశించిన గుర్తింపుని సొంతం చేసుకోలేదు.

By:  Tupaki Desk   |   13 April 2024 3:30 PM GMT
బాలీవుడ్.. మనోళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే..
X

బాలీవుడ్ లో సౌత్ ఇండియన్ స్టార్స్ సక్సెస్ అయ్యింది చాలా తక్కువే. మాధవన్ మాత్రమే సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ బాలీవుడ్ లో సినిమాలు చేసినా ఆశించిన గుర్తింపుని సొంతం చేసుకోలేదు. అలాగే కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున లాంటి స్టార్ యాక్టర్స్ సౌత్ లో గొప్ప నటులుగా ఉన్న బాలీవుడ్ సినిమాలలో మాత్రం తేలిపోయారు.

అయితే సౌత్ దర్శకులతో పాన్ ఇండియా సినిమాలతో ఈ మధ్య సౌత్ ఇండియన్ స్టార్స్ నార్త్ ఇండియాలో కూడా మంచి ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. దీంతో బాలీవుడ్ దర్శకులు సౌత్ స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ లతో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. అయితే బాలీవుడ్ అనే ఇమేజ్ కోసం మన హీరోలు అక్కడి దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సౌత్ హీరోలని అక్కడి దర్శకులు సరైన విధంగా ప్రెజెంట్ చేయరనే అభిప్రాయం ఉంది.

గతంలో రామ్ చరణ్ హిందీలో జంజీర్ అనే మూవీ చేశాడు. ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ని కూడా బాలీవుడ్ ఆడియన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. అలాగే ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ లీడ్ రోల్ లో వచ్చిన ఆదిపురుష్ ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యిందో అందరూ చూసారు. ఆ సినిమాలో ప్రభాస్ బ్యాడ్ పెర్ఫార్మెన్స్ తో ట్రోల్ మెటీరియల్ గా మారిపోయాడు.

బాహుబలి సిరీస్ తో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించిన ప్రభాస్ ని ఓం రౌత్ దారుణంగా ప్రెజెంట్ చేశాడు. సౌత్ బెస్ట్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్, ఆడుజీవితం సినిమాలలో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడో అందరికి తెలిసిందే. తాజాగా హిందీలో రిలీజ్ అయిన బడే మియాన్ చోటే మియాన్ సినిమాలో పృథ్వీరాజ్ విలన్ గా నటించాడు. అయితే ఈ సినిమాలో అతను చాలా బ్యాడ్ పెర్ఫార్మెన్స్ చేసాడని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు పృథ్వీరాజ్ క్యారెక్టర్ ని దారుణంగా ప్రజెంట్ చేసాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి వెళ్తున్నాడు. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే బాలీవుడ్ దర్శకులు సౌత్ హీరోలని రిప్రజెంట్ చేసే విషయంలో ఓవర్ గా వెళతారో లేదంటే అంతగా శ్రద్ధ పెట్టారో కానీ క్యారెక్టర్స్ మాత్రం క్లిక్ కావనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తారక్ ఈ విషయంలో కాస్తా జాగ్రత్త పడాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. అలాగే సినీ విశ్లేషకులు కూడా సలహాలు ఇస్తున్నారు. కంటెంట్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే సౌత్ హీరోలు బాలీవుడ్ స్టార్స్ ని సైతం బీట్ చేసేస్తారని సౌత్ సినీ అభిమానులు అంటున్నారు.