మహాభారతం తీస్తే తారక్ ఓ భాగమే!
సంజయ్ లీలా భన్సాలీ..నితీష్ తివారీ..అషుతోష్ గోవారికర్ లాంటి వారు చేసే అవకాశం ఉంది
By: Tupaki Desk | 22 May 2024 12:30 AM GMTమహాభరతాన్ని తెరకెక్కించడం అన్నది రాజమౌళి ఓ డ్రీమ్ గా పెట్టుకున్నారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? అన్నది అతడికి కూడా తెలియదు. ఇప్పట్లో ఆ కథని తాను తెరకెక్కించలేని...అంతటి అనుభవం తనకు లేదని ఓపెన్ గా నే చెప్పేసారు. మహాభారతాన్ని ఓ యజ్ఞంలా భావించి చేయాల్సిన కథ అని మనసులో మాట చెప్పారు. 10 భాగాలుగా దాన్ని తీయాల్సి ఉంటుందన్నారు. అటు బాలీవుడ్ దర్శకులు కూడా ఈ కథని తెరకెక్కించాలని ఆలోచన చేసేవాళ్లు లేకపోలేదు.
సంజయ్ లీలా భన్సాలీ..నితీష్ తివారీ..అషుతోష్ గోవారికర్ లాంటి వారు చేసే అవకాశం ఉంది. కానీ తలపెట్టిన తర్వాత అనుకున్నంత ఈజీ కాదన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అందుకే మహాభారతాన్ని టచ్ చేయాలంటే అంతా వెనకడుగు వేస్తున్నారు. వీళ్లందరిలో పాన్ ఇండియాలో..పాన్ వరల్డ్ లో ఫేమస్ అయిన రాజమౌళి చేస్తేనే బాగుంటుందని మెజార్టీ వర్గం ఎన్నోసార్లు సోషల్ మీడియాలో అభిప్రాయపడింది. ఒకవేళ రాజమౌళినే టేకప్ చేస్తే గనుక అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాత్రం ఓ రోల్ పక్కా అనొచ్చు.
ఎందుకంటే యంగ్ టైగర్ అందులో నటించాలని అన్న ఆసక్తిని గతంలో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. మహాభారతంలో పాత్రల ఎంపికపై ఫిల్మ్‌మేకర్ మీ సలహా కోరితే ఏమంటారన్న ప్రశ్నకు తారక్ స్పందిస్తూ..` చెప్తే రాజమౌళి చంపేస్తాడు కాబట్టి చెప్పకూడదని అనుకుంటున్నా. అయినప్పటికీ వదలని ఇంటర్వ్యూయర్ కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, భీముడి పాత్రలకు ఎవరిని ఎంచుకుంటారన్న ప్రశ్నకు.. `జూనియర్ తెలివిగా తన పేరు చెప్పి తప్పించుకున్నాడు.
మరి ద్రౌపదిగా ఎవరిని ఎంచుకుంటారంటే ? మాత్రం కొంచెం తబడుతూనే అలియాభట్ పేరు చెప్పాడు. ఆ రకంగా మహాభారతం తీస్తే రాజమౌళి చేయాలని తారక్ మనసులో అభిప్రాయాన్ని చాలా కాలం క్రితమే చెప్పారు. అప్పటికి ఆయనతో `ఆర్ ఆర్ ఆర్` లాంటి పాన్ వరల్డ్ సినిమా చేయలేదు. చేస్తే గనుక జక్కన్న మాత్రమే చేయాలని ఇంకా బలంగా చెప్పేవారేమో!