Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ విధ్వంసం.. ప్లానింగ్ ఈ రేంజ్లో..!

ఎలాంటి పాత్ర ఇచ్చినా తన మార్క్ నటనతో మెప్పించే ఎన్టీఆర్ కచ్చితంగా రాబోయే సినిమాలతో తన ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అయ్యే సినిమాలే చేస్తాడని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   5 Oct 2023 7:47 AM GMT
ఎన్టీఆర్ విధ్వంసం.. ప్లానింగ్ ఈ రేంజ్లో..!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. దేవర డైరెక్టర్ కొరటాల శివ స్పెషల్ వీడియోతో దేవర రెండు భాగాలుగా చేస్తున్నామని చెప్పారు. దేవర సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్ చేశారు. సో ఆ డేట్ కి దేవర ఫస్ట్ పార్ట్ వస్తుంది. కొంత గ్యాప్ తర్వాత దేవర సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతుంది. దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తి చేశాక ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కి డేట్స్ ఇస్తున్నాడని తెలుస్తుంది. 2024 ఫస్ట్ నుంచి ఆ సినిమాకు టైం కేటాయిస్తారట.

మరోపక్క ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో సినిమా లైన్ లో పెట్టాడు. సో ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా 2024 లోనే చేయాల్సి ఉంది. 2024 లో ఎన్టీఆర్ వార్ 2 తో పాటుగా ప్రశాంత్ నీల్ సినిమాకు పనిచేస్తాడని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవర 2 కోసం కొరటాల శివ కు డేట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

దేవర 2 తర్వాత అరవింద సమేత కాంబో త్రివిక్రమ్ తో తారక్ సినిమా ఉంటుందని టాక్. గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ప్లానింగ్ లో ఉంది.

ఆ సినిమా తర్వాత త్రివిక్రం ఎన్టీఆర్ కాంబో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ తో కలిసి పనిచేసేందుకు బాలీవుడ్ దర్శకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వార్ 2 తో ఆల్రెడీ అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయనున్నాడు. వార్ 2 లో తారక్ ది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని టాక్. ఎలాంటి పాత్ర ఇచ్చినా తన మార్క్ నటనతో మెప్పించే ఎన్టీఆర్ కచ్చితంగా రాబోయే సినిమాలతో తన ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అయ్యే సినిమాలే చేస్తాడని తెలుస్తుంది.

ఎన్టీఆర్ దేవర 1, వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2 ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఇది ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల లైనప్ అని తెలుస్తుంది. అయితే వీటిలో ఏది ముందు ఏది వెనక్కి అన్నది మాత్రం అవి సెట్స్ మీద వెళ్లాక డిసైడ్ అవుతుంది. ఎన్టీఆర్ మారం ఎక్కడ తగ్గకుండా వరుస సినిమాలతో దూసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడు.