Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఇక సిద్ధమవ్వండి!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇమేజ్ ఆర్ఆర్ఆర్ తర్వాత అమాంతం పెరిగిపోయింది.

By:  Tupaki Desk   |   20 April 2024 5:01 AM GMT
ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఇక సిద్ధమవ్వండి!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇమేజ్ ఆర్ఆర్ఆర్ తర్వాత అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ దర్శకులు కూడా తారక్ తో సినిమాలు చేయాలని ఆరాటపడుతున్నారు. అయితే ప్రస్తుతం అతనికున్న వరుస కమిట్మెంట్స్ కారణంగా ఇతర దర్శకులకి ఒకే చెప్పలేకపోతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ స్టార్ట్ చేశారు.

ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇది కాకుండా హిందీలో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి తారక్ భారీ బడ్జెట్ తెరకెక్కుతోన్న వార్2 సినిమాలో నటిస్తున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రంలో తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కి సంబందించిన కీలక యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారంట. ఈ రెండు చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ మూవీ చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమాలు పట్టాలెక్కే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ పై ఫోకస్ చేశారు. ఇదిలా ఉంటే మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రాబోతోంది. ఆ రోజు మూడు సినిమాల నుంచి కచ్చితంగా అప్డేట్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఆయా చిత్ర యూనిట్ లు కూడా తారక్ బర్త్ డే రోజు ఏదో ఒక అప్డేట్ రిలీజ్ చేసి స్పెషల్ గా విషెస్ చేయాలని అనుకుంటున్నారు. దేవర చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అలాగే వార్ 2 మూవీ నుంచి తారక్ క్యారెక్టర్ కి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. వీటితో పాటుగా ప్రశాంత్ నీల్ తో స్టార్ట్ కాబోయే ప్రాజెక్ట్ గురించి మైత్రీ మూవీ మేకర్స్ ఏదో ఒక అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు.

ఇలా ఒకే రోజు మూడు సినిమాలకి సంబందించిన అప్డేట్స్ వస్తే ఫ్యాన్స్ కి ఓ విధంగా పండగే అని చెప్పాలి. అసలే ఎన్టీఆర్ వెండి తెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలం అయింది. దేవర సినిమాలో షూటింగ్ అనుకున్న డేట్ కంటే కాస్త ఆలస్యంగా వస్తోంది. కాబట్టి ఎన్టీఆర్ అసలు హడావిడి మరి కొన్ని రోజుల్లో మొదలు కాబోతున్నట్లుగా అర్థమవుతుంది. మరి రాబోయే అప్డేట్స్ ఆ సినిమాలపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి.