Begin typing your search above and press return to search.

లుక్స్ తోనే తారక్ కిక్కిస్తున్నాడుగా..

అవకాశం ఉంటే ఎన్టీఆర్ తో భవిష్యత్తులో మూవీ చేస్తామని కొంతమంది స్టార్ దర్శకులు సైతం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

By:  Tupaki Desk   |   20 May 2024 4:59 PM GMT
లుక్స్ తోనే తారక్ కిక్కిస్తున్నాడుగా..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో సినిమా సినిమాకి తన మార్కెట్ పెంచుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో నటుడిగా హాలీవుడ్ దర్శకులు, క్రిటిక్స్ నుంచి తారక్ ప్రశంసలు అందుకున్నాడు. అవకాశం ఉంటే ఎన్టీఆర్ తో భవిష్యత్తులో మూవీ చేస్తామని కొంతమంది స్టార్ దర్శకులు సైతం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

రాఖీ సినిమా వరకు తారక్ నటుడిగా ఎంత స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న కూడా లుక్స్ పరంగా ఎక్కువ విమర్శలకి గురవుతూ ఉండేవాడు. అయితే యమదొంగ సినిమా నుంచి తారక్ తన లుక్స్ పరంగా ఎక్కువ కేరింగ్ తీసుకున్నారు. స్లిమ్ లుక్ లోకి మారిపోయి పెర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటేన్ చేస్తూ వస్తున్నాడు. మొదటి సారి టెంపర్ మూవీలో తారక్ షర్ట్ విప్పి బాడీ చూపించాడు.

ఆ లుక్ చూసిన తర్వాత చాలా మంది అమ్మాయిలు తారక్ కి అభిమానులుగా మారిపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమా హెవీగా వర్క్ అవుట్స్ చేసి భారీకాయుడుగా తారక్ తనని తాను తెరపై రిప్రజెంట్ చేసుకున్నాడు. అడవిలో పులిని పట్టుకోవడానికి తారక్ చేసే యాక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్ కి ఊహించని హైప్ ఇచ్చింది. ఇపై తారక్ నుంచి రాబోయే సినిమాలు కూడా అంతకు మించి ఉండబోతున్నాయని తెలుస్తోంది.

దేవర సినిమాలో తారక్ రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో మాస్ లీడర్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఏ లుక్స్ ఫ్యాన్స్ కి విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. ప్రస్తుతం వార్ 2 మూవీలో తారక్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అతని పాత్ర చాలా స్టైలిష్ గా ఉండబోతోందని తెలుస్తోంది. తారక్ బర్త్ డే రోజున అతనికి చాలా మంది విషెస్ చెబుతున్నారు. వీటిలో ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్స్ ని కూడా షేర్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసి విషెస్ తెలుపుతున్నారు. ఇందులో తారక్ చాలా స్టైలిష్ గా పెర్ఫెక్ట్ బాడీ షేప్ తో, అదిరిపోయే లుక్స్ తో కిక్ ఇస్తున్నాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వార్ 2 కోసం తారక్ ఈ లుక్ మెయింటేన్ చేస్తున్నాడనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

హృతిక్ రోషన్ చాలా స్టైలిష్ గా, పెర్ఫెక్ట్ బాడీ షేప్ తో ఉంటాడు. అతనికి దీటుగా కనిపించాలంటే ఈ స్థాయిలో ఉండాల్సిందే అనే మాట ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాలో ఇక ఏ రేంజ్ లో తారక్ కనిపిస్తాడనేది తెలుసుకోవాలనే కుతూహలం ఫ్యాన్స్ లో నెలకొని ఉంది. ఆగష్టు నుంచి ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.