Begin typing your search above and press return to search.

నీల్ - ఎన్టీఆర్.. అంతా బాగానే ఉంది కానీ..

ఇప్పుడు డ్రాగన్ కి కూడా అతనినే రిపీట్ చేస్తే ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   10 Aug 2024 1:30 PM GMT
నీల్ - ఎన్టీఆర్.. అంతా బాగానే ఉంది కానీ..
X

పాన్ ఇండియా డైరెక్టర్ గా దూసుకుపోతున్న ప్రశాంత్ నీల్ రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా NTR31 సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేశారు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం నడుస్తోంది. అయితే ప్రొడక్షన్ హౌస్ నుంచి మాత్రం షూటింగ్ గురించి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబందించిన క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నారు.

సలార్ పార్ట్ 2ని పూర్తి చేయకుండానే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాని స్టార్ట్ చేశారు. అయితే ప్రశాంత్ నీల్ టీమ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటి నుంచి రవి బసూర్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ్ ఉన్నారు. ప్రశాంత్ నీల్ మొదటి చిత్రం ఉగ్రం తరువాత చేసిన కేజీఎఫ్ సిరీస్, సలార్ పార్ట్ 1 కి అతనే వర్క్ చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే NTR31 చిత్రానికి కూడా వీరిద్దరిని ప్రశాంత్ నీల్ రిపీట్ చేశారు.

టాలీవుడ్ లో రాజమౌళి మేగ్జిమమ్ తన సినిమాల విషయంలో ఇదే ఫార్ములాని అనుసరిస్తారు. అతనికి రెగ్యులర్ సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి ఉన్నారు. చాలా సినిమాలు వీరిద్దరితోనే చేసి సక్సెస్ లు అందుకున్నారు. అయితే రాజమౌళి సినిమా సినిమాకి కథ, జోనర్ కంప్లీట్ గా మార్చేస్తారు.

ఈ కారణంగా టెక్నీషియన్స్ ని రిపీట్ చేసిన ఇబ్బంది లేదు. ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళి ఫార్ములాని అనుసరిస్తున్న కూడా కథల విషయంలో పెద్దగా మార్పు ఉండటం లేదు. NTR 31 సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే ఉండబోతోంది. గోల్డెన్ ట్రైయాంగిల్ లో ఈ కథని చెప్పబోతున్నారంట.

అత్యంత ప్రమాదకరమైన ఖున్ షా కథని ప్రశాంత్ నీల్ ఆవిష్కరించబోతున్నారంట. ఈ గోల్డెన్ ట్రైయాంగిల్ అనేది బర్మా, థాయ్ లాండ్, లావోస్ మధ్య ఉన్న ప్రమాదకరమైన ప్రాంతం. ఖున్ షా చీకటి సామ్రాజ్యాన్ని డ్రాగన్ బయటపెట్టింది. ఈ కథతోనే 1969 బ్యాక్ డ్రాప్ లో డ్రాగన్ మూవీని ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడంట.

అంటే కేజీఎఫ్, సలార్ తరహాలోనే డ్రాగన్ మూవీ ఉంటుందని అర్ధమవుతోంది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా కేజీఎఫ్ సిరీస్ కి బెస్ట్ ఇచ్చిన రవి సలార్ విషయంలో కొంత తేలిపోయారు. ఇప్పుడు డ్రాగన్ కి కూడా అతనినే రిపీట్ చేస్తే ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సౌండ్, విజువల్స్ పరంగా ప్రేక్షకులు మొనాటనీ ఫీల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.