Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - నీల్.. బడ్జెట్ గట్టిగానే..

ప్రశాంత్ నీల్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో చేయబోయే సినిమా ఇదని తెలుస్తోంది. నిజానికి ఇది ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంట.

By:  Tupaki Desk   |   19 Aug 2024 2:30 PM GMT
ఎన్టీఆర్ - నీల్.. బడ్జెట్ గట్టిగానే..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “డ్రాగన్” మూవీని గ్రాండ్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. “ఆర్ఆర్ఆర్” తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ 400 కోట్లకి రీచ్ అయ్యింది. "ఆర్ఆర్ఆర్" తో గ్లోబల్ లెవల్ లో ఇమేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ సోలోగా “దేవర” సినిమాతో తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

“దేవర” మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై 350+ కోట్ల బిజినెస్ వరల్డ్ వైడ్ గా జరిగిందంట. కచ్చితంగా “దేవర” మూవీ ఎన్టీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అలాగే బెస్ట్ ఓపెనింగ్స్ కూడా వస్తాయని భావిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. "దేవర" మూవీ నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కి సూపర్ హిట్ టాక్ వచ్చింది. నెక్స్ట్ రాబోయే పాటలకి కూడా ఇదే స్థాయిలో సాలిడ్ రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా గురించి తారక్ ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అయ్యే న్యూస్ ఒకటి బయటకొచ్చింది. “డ్రాగన్” సినిమాని ఏకంగా 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నారంట.

ప్రశాంత్ నీల్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో చేయబోయే సినిమా ఇదని తెలుస్తోంది. నిజానికి ఇది ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. అయితే మొదట దర్శకుడిగా తన స్టామినా ప్రూవ్ చేసుకున్న తర్వాత "డ్రాగన్" సినిమాని చేయాలని అనుకున్నారంట. ఆరంభంలోనే భారీ బడ్జెట్ అంటే ఎవరు ముందు రారని భావించి ఇంత కాలం వెయిట్ చేసారంట. ఈ సినిమా కథ కూడా ప్రశాంత్ నీల్ ఎప్పడో సిద్ధం చేసుకున్నారంట.

ఫైనల్ గా ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడంతో బడా నిర్మాతలు ముందుకొచ్చి ఈ ఆయనపై భారీ బడ్జెట్ లు పెట్టడానికి రెడీ అయ్యారు. "డ్రాగన్" మూవీ బడ్జెట్ కి మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సిద్ధం కావడంతో ప్రశాంత్ నీల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని నిర్మాతలు తీసుకురావాలని అనుకుంటున్నారు. దీంతో ప్రశాంత్ నీల్ కూడా “డ్రాగన్” మూవీపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.