Begin typing your search above and press return to search.

టైగ‌ర్ రంగంలోకి దిగేది మెక్సికో నుంచా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్-ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో భారీ అంచ‌నాల మ‌ద్య ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Jun 2024 6:32 AM GMT
టైగ‌ర్ రంగంలోకి దిగేది మెక్సికో నుంచా?
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్-ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో భారీ అంచ‌నాల మ‌ద్య ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కి `డ్రాగ‌న్` అనే టైటిల్ ని కూడా ప‌రిశీలిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి నీల్ `సలార్ -2` ప‌నుల్లో ఉండాలి. కానీ అనూహ్యంగా ఆప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టి యంగ్ టైగ‌ర్ చిత్రాన్ని తెర‌పైకి తెస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

ఆగ‌స్టులో సినిమా ప్రారంభోత్స‌వంతో పాటు రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌ల‌వుతుంద‌ని తాజాగా అందుతోన్న స‌మాచారం. ఈ నేప‌థ్యంలో మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ సినిమా తొలి షెడ్యూల్ మెక్సికో లో ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారుట‌. నీల్ రాసుక‌న్న క‌థ‌కి అక్క‌డ బ్యాక్ డ్రాప్ అయితే బాగుంటుంద‌ని తొలి షెడ్యూల్ అక్క‌డ ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు లీకులందుతున్నాయి. ఇందులో పూర్తిగా యాక్ష‌న్ స‌న్నివేశాలే చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం.

అలాగే మేజర్ పార్టు షూటింగ్ అంతా కూడా విదేశాల్లోనే ఉంటుందంటున్నారు. ఆదాపు 15 దేశాల్లో ఈ సినిమా షూటింగ్ ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాల నుంచి వినిపిస్తోన్న స‌మాచారం. మ‌రి ఇందులో నిజ‌మెంతో ఖ‌రారు కావాల్సి ఉంది. నీల్ సినిమాలంటే ఎలా ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. `కేజీఎఫ్‌`..`స‌లార్` తో అత‌డి బ్యాక్ డ్రాప్ లు..స్టోరీలు ఎంతో ఇన్నోవేటివ్ గా ఉంటాయి. సినిమా ఖ‌ర్చు కూడా అలాగే ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన రెండు సినిమాలు కూడా ఇండియాలో షూట్ చేసిన‌వే.

అందుకే తార‌క్ ని కొత్త‌గా ప్ర‌జెంట్ చేయ‌డం కోసం ఏకంగా విదేశాల్లోనే మేజ‌ర్ పార్టు షూట్ ప్లాన్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇందులో తార‌క్ కి జోడీగా నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మిక మంద‌న్నా ని ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అదే నిజ‌మైతే తార‌క్ కి ప‌ర్పెక్ట్ పెయిర్ గా చెప్పొచ్చు. హైట్..వెయిట్ అన్ని ర‌కాలుగానూ ర‌ష్మిక మ్యాచ్ అవు తుంది.ఇప్ప‌టికే ఈ అమ్మ‌డు కూడా `యానిమ‌ల్`, `పుష్ప‌`తో పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే.